భారతదేశంలో కరోనా వైరస్ లెక్కల విషయంలో పూర్తి విరుద్ధంగా అనిపించే విషయాలు కనబడుతున్నాయి. దేశంలో రెడ్ జోనల్ సంఖ్య తగ్గింది. ఇది శుభ పరిణామం. కానీ వీటితోపాటుగా గ్రీన్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది.
భారతదేశంలో కరోనా వైరస్ లెక్కల విషయంలో పూర్తి విరుద్ధంగా అనిపించే విషయాలు కనబడుతున్నాయి. దేశంలో రెడ్ జోనల్ సంఖ్య తగ్గింది. ఇది శుభ పరిణామం. కానీ వీటితోపాటుగా గ్రీన్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది.
రెడ్ జోన్లు తగ్గాయంటే... వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలు నెమ్మదిగా కోలుకొని సాధారణ స్థాయికి వస్తున్నట్టు. గ్రీన్ జోన్లు తగ్గడమంటే... దేశంలో కరోనా వైరస్ ఇంతవరకు లేని చోట కూడా వ్యాపిస్తుందన్నట్టు. ఇప్పుడు ఈ డేటా చూసి రెండ్ జోన్లు తగ్గినందుకు సంతోష పడాలో, గ్రీన్ జోన్లు కూడా తగ్గుతున్నందుకు బాధపడాలో అర్థం కానీ పరిస్థితి.
undefined
ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు రెడ్ జోన్ల సంఖ్య 170 నుంచి 130 కి పడిపోయాయి. అదే కాలంలో గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 356 నుంచి 316 కి పడిపోయాయి. లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో ఈ జోన్ల వర్గీకరణను చేసింది.
అన్ని మెట్రో నగరాలు కూడా రెడ్ జోన్ల పరిధిలోనే ఉండడం గమనార్హం. ఢిల్లీలోని అన్ని జిల్లాలు కూడా రెడ్ జోన్లోనే ఉన్నాయి. అత్యధికంగా 19 రెడ్ జోన్ జిల్లాలతో యూపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.
ఈశాన్య భారతదేశంలో అత్యధికంగా గ్రీన్ జోన్లు ఉన్నాయి. 30 జిల్లాలతో అస్సాం అత్యధిక గ్రీన్ జోన్లు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గ్రీన్ జోన్లలో సడలింపులతో వాణిజ్య వ్యాపారాలను తెరిచేందుకు కేంద్రం అనుమతులివ్వనున్నట్టు తెలియవస్తుంది.
ఇకపోతే రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి మారాలంటే ఇంతకుముందు 28 రోజుల కాలంపాటు అక్కడ కేసునమోదు కాకుండా ఉండాల్సి ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం ఆ కాలాన్ని 21 రోజులకి కుదించింది.