మే 2 తర్వాత చివరి అస్త్రం, లాక్ డౌన్ అవకాశం, మోడీ మదిలో ఏముంది..?

By Siva KodatiFirst Published Apr 24, 2021, 5:04 PM IST
Highlights

దేశంలో మే 2 తర్వాత లాక్‌డౌన్ విధిస్తారా....? ప్రధాని మోడీ వరుస భేటీలు ఏం చెబుతున్నాయి..? పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ వెనుక అసలు విషయం ఏంటీ..? దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మే 15 నాటికి కరోనా పీక్స్‌కు చేరుతుందంటూ నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో మరోసారి లాక్‌డౌనే పరిష్కారమన్న వాదన వినిపిస్తోంది

దేశంలో మే 2 తర్వాత లాక్‌డౌన్ విధిస్తారా....? ప్రధాని మోడీ వరుస భేటీలు ఏం చెబుతున్నాయి..? పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ వెనుక అసలు విషయం ఏంటీ..? దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మే 15 నాటికి కరోనా పీక్స్‌కు చేరుతుందంటూ నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో మరోసారి లాక్‌డౌనే పరిష్కారమన్న వాదన వినిపిస్తోంది.

అయితే చివరి అస్త్రంగా మాత్రమే లాక్‌డౌన్ వుండాలని ఇటీవల ప్రధాని మోడీ చెప్పారు. దీంతో మే 2 తర్వాత చివరి అస్త్రంగా లాక్‌డౌన్ ప్రయోగిస్తారా అన్న ఊహాగానాలు పెరిగాయి. మే, జూన్ నెలలకు గాను తలో 5 కేజీల చొప్పున  సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా సమకూరుస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

వీటన్నింటిని పరిశీలిస్తే.. మే 2 తర్వాత ఎప్పుడైనా లాక్‌డౌన్ విధించవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. పరిస్దితులు విషమిస్తే లాక్‌డౌన్ ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఈ నెల 29న చివరి దశ పోలింగ్ ఉన్నందున మే 2న ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.

Also Read:షాకింగ్ : రోజువారీ కేసుల్లో, మరణాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్.. కొత్తగా 3.46 లక్షలు !!

అనంతరం దేశంలోని పరిస్ధితులపై కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్ధ అవస్థలు, పరిశ్రమల నష్టాలు, వలస కూలీల సమస్యలు పెరుగుతాయన్న సందేహాలు వున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు మరో మార్గం లేదన్న మాట కేంద్రం నుంచి వినిపిస్తోంది.

గతేడాది లాక్‌డౌన్  నిర్ణయాన్ని ఆకస్మాత్తుగా ప్రకటించడంతో అనేక వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయి. దీంతో ఈసారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వుండేందుకు ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు తీసుకున్నాయి.

అయినా కేసులు తగ్గుముఖం పట్టలేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్ధితులు నెలకొన్నాయని ఆయా హైకోర్టులు వ్యాఖ్యానిస్తున్నాయి. అటు సుప్రీంకోర్టు కూడా నేషనల్ ఎమర్జెన్సీలా పరిస్థితి వుందని స్పష్టం చేసింది. దీంతో చివరి ఆయుధంగా లాక్‌డౌన్  ప్రకటన వుంటుందన్న ప్రచారం జరుగుతోంది. 

click me!