మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నా: పార్లమెంట్ కొత్త భవనంలో మోడీ

Published : Sep 19, 2023, 01:47 PM ISTUpdated : Sep 19, 2023, 02:01 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నా:  పార్లమెంట్ కొత్త భవనంలో మోడీ

సారాంశం

కొత్త పార్లమెంట్ భవనంలో  లోక్ సభ కొలువు దీరింది.  కొత్త పార్లమెంట్ భవనంలో  లోక్ సభ సభ్యులనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.  

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ  తెలిపారు.కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ  మంగళవారంనాడు ప్రసంగించారు. .పార్లమెంట్ భవనం మారింది, భావనలు కూడ మారాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

గణేష్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టామన్నారు. అజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలంగా  ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ లో సభకు ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నామని  ప్రధాని మోడీ చెప్పారు.ఆధునికతకు అద్దం పట్టడంతో  పాటు చరిత్రను  ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్టుగా మోడీ పేర్కొన్నారు. . అమృత కాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టుగా  ప్రధాని మోడీ  చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సెంగోల్‌ది కీలక పాత్ర అని  మోడీ గుర్తు చేశారు. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువు దీరిందన్నారు.

కొత్త సంకల్పంతో  కొత్త భవనంలోకి అడుగు పెట్టినట్టుగా ప్రధాని మోడీ చెప్పారు. భారత్ నేతృత్వంలో  జీ 20 సదస్సును ఘనంగా నిర్వహించిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
వినాయక చవితి అంటే అందరికీ తిలక్ గుర్తు వస్తారన్నారు.తమ ప్రయోజనం కోసం కాకుండా దేశ హితం కోసం  పనిచేయాలని ప్రధాని మోడీ రాజకీయ పార్టీలకు సూచించారు.ఆటల నుండి అంతరిక్షం వరకు  మహిళలు ముందంజలో ఉన్నారన్నారు. మహిళా సాధికారితపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు.మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం భగవంతుడు తనకు  ఇచ్చాడని మోడీ చెప్పారు.
మహిళా రిజర్వేషన్  అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉందని మోడీ గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. నారీశక్తి బిల్లును చట్టం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని  ప్రధాని స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు పెట్టినట్టుగా  మోడీ పేర్కొన్నారు.కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు.మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్ననే కేంద్రం ఆమోదించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అభివృద్ది ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నామన్నారు.నారీశక్తి వందన్ తో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని  మోడీ చెప్పారు. ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu