పిల్లాడి దేశభక్తి పాటకు ప్రధాని మోడీ చిటికెలు.. జర్మనీలో ప్రవాస భారతీయులతో ఆహ్లాదంగా సమయం

Published : May 02, 2022, 08:14 PM IST
పిల్లాడి దేశభక్తి పాటకు ప్రధాని మోడీ చిటికెలు.. జర్మనీలో ప్రవాస భారతీయులతో ఆహ్లాదంగా సమయం

సారాంశం

ప్రధాని మోడీ ఈ రోజు తన జర్మనీ పర్యటనలో ప్రవాస భారతీయులను కలిశారు. ఈ కార్యక్రమంలో ఓ బాలిక నరేంద్ర మోడీకి తాను గీసిన మోడీ చిత్రపటాన్ని అందించారు. ఆ చిత్రాన్ని చూసి దానిపై మోడీ తన ఆటోగ్రాఫ్ పెట్టారు. అనంతరం ఓ పిల్లాడు దేశభక్తి పాట పాడారు. దానికి మోడీ కూడా చిటికెలు వేస్తూ హుషారు పెంచారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని సోమవారం జర్మనీలో ప్రవాస భారతీయులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అందులో కొందరు ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా పొందరు. కాగా, ఓ పిల్లాడు ప్రధాని మోడీకి దేశ భక్తి పాట పాడి వినిపించాడు. ఆ పిల్లాడి పాటను ఆసక్తిగా విన్న ప్రధాని మోడీ.. మధ్యలోనే తన చిటికెలతో పిల్లాడికి మరింత హుషారు తెప్పించాడు. దీంతో ఆ హోటల్ హాల్ మొత్తం ఆ పాట వింటూ ఎంజాయ్ చేశారు.

బెర్లిన్‌లోని హోటల్ అడ్లాన్ కెంపిన్‌స్కిలో ప్రవాస భారతీయులను ప్రధాని మోడీ కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే పిల్లాడు పాట పాడాడు. అంతకంటే ముందే ప్రధాని మోడీతో ఓ బాలిక మాట్లాడింది. ఆమె ప్రధాని మోడీని తన ఇన్‌స్పిరేషన్ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె తాను వేసిన ప్రధాని మోడీ స్కెచ్ చిత్రపటాన్ని అందించారు. మోడీ ఆ రేఖా చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ స్కెచ్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అనంతరం ఓ పిల్లాడు దేశ భక్తి పాట పాడారు. కాగా, అక్కడ ప్రవాస భారతీయులంతా ప్రధాని మోడీతో కలిసి ఉన్నట్టుగా కనిపించే ఫొటోలు, వీడియోల కోసం తాపత్రయ పడ్డారు. అందరూ ఒకరితో మరొకరు పోటీ పడి వీడియోలు తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే