కొత్త పార్లమెంట్ భవనం: ప్రారంభించిన మోడీ

Published : May 28, 2023, 09:14 AM ISTUpdated : May 28, 2023, 09:52 AM IST
కొత్త  పార్లమెంట్ భవనం:  ప్రారంభించిన  మోడీ

సారాంశం

కొత్త  పార్లమెంట్  భవనాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  ప్రారంభించారు.  


న్యూఢిల్లీ: కొత్త  పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆదివారం నాడు  ఉదయం  ప్రారంభించారు.  కొత్త  పార్లమెంట్    భవన  ప్రారంభోత్సవ కార్యక్రమం  ఇవాళ   ఉదయం  07:15  గంటల నుండి  ప్రారంభమైంది. ఇవాళ  ఉదయం  తొమ్మిది గంటలకు  స్పీకర్ చాంబర్ సమీపంలో  రాజదండాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ  ప్రతిష్టించారు. 
కొత్త  పార్లమెంట్  భవనం ప్రారంభోత్సవం  కార్యక్రమంలో  పలువురు  కేంద్ర మంత్రులు , పలు  రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  పాల్గొన్నారు. కొత్త  పార్లమెంట్  భవన  నిర్మాణ  పనుల్లో  పాల్గొన్న  కార్మికులను  ప్రధాని నరేంద్ర మోడీ  సత్కరించారు. 

 

తొలుత  పార్లమెంట్ నూతన  భవనంలో   ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూజల  తర్వాత  రాజదండానికి  ప్రధాని నరేంద్ర మోడీ   నమస్కారం  పెట్టారు.  అనంతరం  స్పీకర్ చాంబర్ లో  రాజదండాన్ని  ప్రతిష్టించారు. 

కొత్త  పార్లమెంట్  భవనం  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని  కాంగ్రెస్ సహా  కొన్ని విపక్ష పార్టీలు బహిష్కరించాయి.. కొత్త  పార్లమెంట్  భవనాన్ని  రాష్ట్రపతితో   ప్రారంభించాలని  విపక్షాలు  డిమాండ్  చేశాయి.  ప్రధాని నరేంద్ర మోడీతో  కొత్త పార్లమెంట్  భవనం  ప్రారంభించడాన్ని  విపక్షాలు తప్పుబడుతున్నాయి. కొత్త  పార్లమెంట్  భవనం  ప్రారంభోత్సవాన్ని  పురస్కరించుకొని  ఇవాళ  ఉదయం నుండి  సాయంత్రం మూడు గంటల వరకు  ఢిల్లీలో  ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

కొత్త  పార్లమెంట్  భవనం  ప్రారంభోత్సవాన్ని  పురస్కరించుకొని  ఇవాళ  ఉదయం నుండి  సాయంత్రం మూడు గంటల వరకు  ఢిల్లీలో  ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.  కొత్త లోక్  సభ  చాంబర్  భారతదేశ  జాతీయపక్షి నెమలి మాదిరిగా  నిర్మించారు.  కొత్త రాజ్యసభ చాంబర్ ను  జాతీయ పుష్పం  కమలం పోలి ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ  చాంబర్ లు,  ఆశోక్ చక్ర నిర్మాణానికి సంబంధించిన  సామాగ్రిని ఇండో ర్ నుండి  తెచ్చారు.  ఆశోక్ చక్ర చిహ్నం కోసం అవసరమైన  సామాగ్రిని  ఔరంగబాద్ , జైపూర్ నుండి  సేకరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !