కరోనా రికవరీలో ఇతర దేశాల కంటే మెరుగు: మోడీ

By narsimha lodeFirst Published Jul 27, 2020, 5:51 PM IST
Highlights

దేశంలో కరోనా రోగుల రికవరీ ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 


న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోగుల రికవరీ ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

ఐసీఎంఆర్ కు చెందిన మూడు ల్యాబ్ లను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ముంబై, కొల్‌కత్తా, నోయిడాలలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 

also read:కరోనా వేగంగా విస్తరిస్తోంది, నిర్లక్ష్యం వద్దు: మన్‌కీ బాత్ లో మోడీ

కరోనాపై యుద్ధంలో మనం తీసుకొనే ఆహారమే ఆయుధమని ప్రదాని మోడీ అబిప్రాయపడ్డారు.ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 11 లక్షలకు పైగా ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉంచినట్టుగా ఆయన వివరించారు. మరో వైపు 1300 ప్రయోగశాలలు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

also read:128 మందితో పెళ్లి: వధూవరులు సహా 43 మందికి కరోనా

ఈ ల్యాబ్ లు  కరోనా పరీక్షలకు మాత్రమే పరిమితం కావని మోడీ చెప్పారు. భవిష్యత్తులో హెపటైటిస్ బీ, సీతో పాటు హెచ్ఐవీ, డెంగ్యూ సహా ఇతర వ్యాధుల పరీక్షల టెస్టులను నిర్వహించనున్నట్టుగా ఆయన వివరించారు.

click me!