128 మందితో పెళ్లి: వధూవరులు సహా 43 మందికి కరోనా

By narsimha lodeFirst Published Jul 27, 2020, 3:06 PM IST
Highlights

 నూతన వధూవరులతో పాటు 43 మందికి కరోనా సోకింది. నిబంధనలకు విరుద్దంగా పెళ్లి నిర్వహించడంతో 43 మందికి కరోనా సోకింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.

తిరువనంతపురం:  నూతన వధూవరులతో పాటు 43 మందికి కరోనా సోకింది. నిబంధనలకు విరుద్దంగా పెళ్లి నిర్వహించడంతో 43 మందికి కరోనా సోకింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.

కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లాలోని చెంగల పంచాయితీ పరిధిలోని పిలంకట్ట గ్రామంలో ఈ నెల 17వ తేదీన పెళ్లి జరిగింది.ఈ పెళ్లికి 128 మంది హాజరయ్యారు. వాస్తవానికి పెళ్లికి కేవలం 43 మంది మాత్రమే హాజరుకావాలి. కానీ కరోనా నిబంధనలకు విరుద్దంగా ఈ పెళ్లికి 125 మంది హాజరయ్యారు.

వధువు తండ్రి, వరుడు దుబాయ్ నుండి కేరళకు నెల రోజుల క్రితం వచ్చారు. పెళ్లి జరిగిన తర్వాత తొలుత వధువు తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో కుటుంబసభ్యులు కూడ పరీక్షలు నిర్వహించుకొన్నారు. వధువుతో పాటు వరుడికి కరోనా సోకింది. మరో వైపు ఈ పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబసభ్యులు కూడ పరీక్షలు నిర్వహించుకొన్నారు. 128 మంది పెళ్లికి హాజరైతే వారిలో 43 మందికి కరోనా సోకింది.

also read:పెళ్లికి గంటల ముందే వరుడికి షాక్, ఆగిన పెళ్లి: ఆసుపత్రికి క్యూ కట్టిన బంధువులు

వధువు కుటుంబసభ్యులను హోం క్వాంరటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ పెళ్లికి హాజరైనవారిలో కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు వైద్యులు.

కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా పెళ్లి నిర్వహించినందుకు వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాసరగోడ్, మంజేశ్వరం,కుంబల, నీలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.


 

click me!