PM Modi in US: ఈ దశాబ్దాన్ని 'టెక్ దశాబ్దం'గా మార్చ‌డ‌మే భారత్ లక్ష్యం.. : ప్ర‌ధాని మోడీ

Published : Jun 22, 2023, 03:23 AM IST
PM Modi in US: ఈ దశాబ్దాన్ని 'టెక్ దశాబ్దం'గా మార్చ‌డ‌మే భారత్ లక్ష్యం.. :  ప్ర‌ధాని మోడీ

సారాంశం

Modi US visit 2023: ఈ దశాబ్దాన్ని ''టెక్ దశాబ్దంగా'' మార్చడం భారత్ లక్ష్యంగా ఉంద‌ని అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. యూఎస్ లోని వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ఉన్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సందర్శించారు. యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనేది ఒక స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీ, ఇది మొత్తం 50 రాష్ట్రాలు, యూఎస్ భూభాగాలలో సైన్స్-ఇంజనీరింగ్ అభివృద్దికి మద్దతు ఇస్తుంది.   

PM Modi in US: ఈ దశాబ్దాన్ని టెక్ దశాబ్దంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన అధికారిక తొలి అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ చేరుకున్న మోడీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కు మద్దతు ఇచ్చే అమెరికా ఫెడరల్ ఏజెన్సీని సందర్శించారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ తో కలిసి, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన పరిశ్రమలలో విజయం సాధించడానికి నైపుణ్యాలను నేర్చుకుంటున్న భారత్-యూఎస్ రెండు దేశాల‌కు చెందిన విద్యార్థులను ప్రధాని మోడీ కలుసుకున్నారు. విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేష న్ తో భార‌త‌దేశం ప‌లు ప్రాజెక్టుల పై ప‌నిచేస్తోంద‌ని అన్నారు. ఈ దశాబ్దాన్ని టెక్ దశాబ్దంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమనీ, దీనిని 'టెక్కేడ్'గా అభివర్ణించారు.

పాఠశాలల్లో 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామనీ, ఇందులో పిల్లలకు వివిధ రకాల ఆవిష్కరణల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 'స్టార్టప్ ఇండియా' మిషన్ ను ప్రారంభించాని తెలిపారు. ఈ దశాబ్దాన్ని టెక్ దశాబ్దంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.

 

 

"వాషింటన్ డీసీని సందర్శించిన వెంటనే ఈ యువ, సృజనాత్మక వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ఎస్ఎఫ్ తో కలిసి భారత్ అనేక ప్రాజెక్టులపై పనిచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి నిర్వహించినందుకు ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కు ధన్యవాదాలు. మీ జీవితం, మీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఉజ్వల భవిష్యత్తుకు విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు ముఖ్యమ‌ని'' పేర్కొన్నారు.  ప్రధాని మోడీ తన ప్రసంగంలో నూతన విద్యావిధానం, భారతదేశంలో జరుగుతున్న సమగ్ర విద్య, నైపుణ్యాలను కూడా ప్రస్తావించారు. స్కిల్ ఇండియా కింద కృత్రిమ మేధ, బ్లాక్ చెయిన్, డ్రోన్ తదితర రంగాల్లో కోట్ల మందికి నైపుణ్యం కల్పించామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu