PM Modi Hyderabad visit: ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌.. ట్విట్ట‌ర్ లో #గోబ్యాక్ మోడీ ట్రెండింగ్‌.. ఏం జ‌రుగుతోంది?

Published : May 26, 2022, 12:59 PM IST
PM Modi Hyderabad visit: ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌.. ట్విట్ట‌ర్ లో #గోబ్యాక్ మోడీ ట్రెండింగ్‌.. ఏం జ‌రుగుతోంది?

సారాంశం

#GoBackModi is trending on Twitter:  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురువారం నాడు హైద‌రాబాద్‌, చెన్నైలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో #గోబ్యాక్ మోడీ (#GoBackModi) హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. మోడీ ప‌ర్య‌ట‌న‌పై ఎందుకు ఇలా స్పంద‌న వ‌స్తోంది? చర్చకు తెరలేపింది.   

PM Modi Hyderabad visit: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురువారం నాడు త‌మిళ‌నాడులోకి చెన్నై, తెలంగాణ‌లోని హైదరాబాద్ లో ప‌ర్య‌టించ‌నున్నాయి. అయితే, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో #గోబ్యాక్ మోడీ (#GoBackModi) హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. మోడీ ప‌ర్య‌ట‌న‌పై ఎందుకు ఇలా స్పంద‌న వ‌స్తోంది? అనేది తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కోసం గురువారం చెన్నై చేరుకుంటున్న ప్రధానమంత్రికి పరిపాలన ఐదు అంచెల భద్రతను అందించడంలో బిజీగా ఉన్న త‌రుణంలో Twitter లో  #GoBackModi ట్రెండింగ్ కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే టాప్ ట్రెండ్ లో ఉంది. మోడీ రాష్ట్ర పర్యటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.  బీజేపీ సిద్ధాంతం, ధరల పెంపు, ఇంధన ధరలు, హిందీ భాషా వివాదం, వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు మొదలైన పలు కారణాలతో నెటిజన్లు  ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

కాగా, మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరకుంటారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. అక్కడ దిగిన తర్వాత రోడ్డుమార్గంలో  గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు మోదీ చేరుకుంటారు. సాయంత్రం 4 .15 గంటలకు  బేగంపేట్ నుండి చెన్నైకి వెళ్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !