
కర్ణాటక : తెల్లారితే పెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఇల్లంతా కళకళలాడుతోంది. marriageతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు bride ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి elope అయ్యింది.
వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణమండపంలో వివాహం జరగాల్సి ఉండగా ఆ పెళ్లి నిలిచిపోయింది. వధువు పరారు కావడమే ఇందుకు కారణం. నగర శివారులోని నాగిరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), కరేకల్లహళ్లివాసి సురేష్ కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు.
ఇదే అదనుగా ఆ వధువు అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ (25)తో గుట్టు చప్పుడు కాకుండా పరారైంది. ఉదయం లేచి చూసేసరికి వధువు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామతోనే పెళ్లి చేసే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్ళికొడుకు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో జరిగింది. నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి వధువు పరారయ్యింది. మరో వ్యక్తి పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది.
మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయం చేశారు. నవంబర్ 13 రాత్రి స్థానిక marriage hallలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు.నవంబర్ 14 ఉదయం 5.30 గంటలు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, 13 అర్థరాత్రి bride మండపం నుంచి వెళ్లిపోయింది.
తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు twotown police station వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్ వద్దే ఉన్నారు. ఇంతలో కనిపించకుండా పోయిన ఆ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చింది.తమకు security కల్పించాలని పోలీసులను కోరింది. యువతి మేజర్ కావడతో ఆమె ఇష్టప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.
వధువు మాట్లాడుతూ.. ‘ఇష్టంలేని వివాహం చేస్తున్నారని ఈ నెల 3న డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నా parentsతో మాట్లాడు. అప్పుడు పెళ్లి చేయమని పోలీసులకు చెప్పారు. ఆ తరువాత నన్ను house arrest చేశారు. అందుకే వివాహ సమయంలో అందరూ పడుకున్నాక వెళ్లాను. నేను ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులో పెళ్లి చేసుకున్నా’ అని తెలిపింది.