కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్ పొడిగింపు

By narsimha lodeFirst Published May 23, 2021, 12:37 PM IST
Highlights

దేశ రాజధాని న్యూఢిల్లీలో లాక్‌డౌన్‌ను  మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది.  ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్ రాష్ట్రంలో అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో లాక్‌డౌన్‌ను  మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది.  ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్ రాష్ట్రంలో అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌డౌన్ తర్వాత న్యూఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నాడు న్యూఢిల్లీలో కరోనా కేసులు 1600గా నమోదయ్యాయి. లాక్‌డౌన్ కారణంగానే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం లాక్‌డౌన్ ను మరో వారం రోజుల పాటు  పొడిగించింది.  

కరోనా కేసులు తగ్గితే ఈ నెలాఖరు తర్వాత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. వాస్తవానికి ఈ నెల 24వ తేదీ ఉదయంతో లాక్‌డౌన్ కొనసాగాలి. అయితే కరోనా కేసులు కట్టడి అవుతున్న నేపథ్యంలో  లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. లాక్‌డౌన్ అమలు చేయడంతో రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌కి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.  కరోనాను పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకొచ్చేందుకు గాను మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ను కేజ్రీవాల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

click me!