జీవితపు వృక్షాన్ని ఫిన్లాండ్ ప్రధానికి బహూకరించిన మోడీ

Published : May 04, 2022, 07:13 PM IST
జీవితపు వృక్షాన్ని ఫిన్లాండ్ ప్రధానికి బహూకరించిన మోడీ

సారాంశం

ఫిన్లాండ్ ప్రధాని సాన మెరీన్‌కు భారత ప్రధాని మోడీ మన దేశ హస్తకళల నైపుణ్యాన్ని తెలియజేసేలా జీవితపు వృక్షాన్ని బహూకరించాడు. ఇత్తడితో తయారు చేసిన ఈ గిఫ్ట్‌ 2ను మోడీ ఫిన్లాండ్ పీఎంకు అందజేశారు.  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐరోపా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన రెండో నోర్డిక్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సులో పాల్గొన్నారు. పర్యావరణ మార్పులు, పునరుత్పాదక వనరులు, కరోనా అనంతరం ఆర్థిక వృద్ధి, రక్షణ పరమైన సవాళ్లు వంటి అంశాలపై చర్చించారు. అలాగే నోర్డిక్ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవల్సిన చర్యల  గురించి మాట్లాడారు. ఈ సదస్సు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరిగింది. ఈ సదస్సుతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాల నేతలతోనూ వ్యక్తిగతంగా ముఖాముఖిగా భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే భారత ప్రధాని ఫిన్లాండ్ ప్రధాని సాన మెరీన్‌తోనూ సమావేశం అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇతర అంశాల్లో ఈ రెండు దేశాల పరస్పర సహకారం పెరగాలని కాంక్షించారు. ఈ అంశాల్లో రెండు దేశాలు మరింత దగ్గరవ్వడానికి గల అవకాశాలపై ప్రధాని మోడీ, ఫిన్లాండ్ ప్రధాని సాన మెరీన్‌లు చర్చించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిన్లాండ్ ప్రధాని సాన  మెరీన్‌కు అరుదైన బహుమానం అందించారు. రాజస్తాన్‌కు చెందిన ట్రీ ఆఫ్ లైఫ్‌ను ప్రధాని ఆమెకు అందించారు. ఇత్తడితో చెట్టు ఆకారంలో రూపొందించిన  ఈ గిఫ్ట్ అరుదైనది. భారత హస్తకళల నైపుణ్యాన్ని ఇది వివరిస్తున్నది. ఈ చెట్టు పేరు ట్రీ ఆఫ్ లైఫ్‌గా పెట్టారు. ఈ చెట్టు జీవిత పురోగతిని సూచిస్తుందని పేర్రకొన్నారు. ఈ చెట్టు కొమ్మలు పైనకు వెళ్లినకొద్దీ చిలిపోయి మరింత పెద్దగా వ్యాపించి ఉంటాయి. ఆ చెట్టుపై ఉన్న పిట్టలు, ఇతర జీవులను సూచిస్తే... అది జీవితంలో సంఘటితం అయ్యేవారినీ గుర్తు చేసింది. ఆ చెట్టు వేర్లు.. మన జీవితానికి భూమితో ముడిపడిన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆ చెట్టు ఆకులు, పిట్టలు జీవితాన్ని, అందులోని క్యాండిల్ స్టాండ్ జీవితంలో వెలుగును ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల ఐరోపా దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తొలిరోజు జర్మనీలోనే గడిపారు. ఆ తర్వాత మంగళవారం బెర్లిన్ నుంచి డెన్మార్క్‌కు విచ్చేశారు. డెన్మార్క్ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లి స్వల్ప కాలమే అక్కడ గడిపి తిరిగి భారత్‌కు తిరిగి రానున్నారు.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?