రాష్ట్ర హోదా పునరుద్దరించండి: జమ్మూ కాశ్మీర్ నేతలు

By narsimha lodeFirst Published Jun 24, 2021, 8:11 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్ర హోదా పునరుద్దరించే  అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ విషయమై మోడీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు చెప్పారు. 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్ర హోదా పునరుద్దరించే  అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ విషయమై మోడీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు చెప్పారు. గురువారం నాడు న్యూఢిల్లీలో మూడు గంటల పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన  నేతలు సమావేశమయ్యారు. 8 పార్టీల నుండి 14 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

also read:జమ్మూ కాశ్మీర్‌ అఖిలపక్షనేతలతో మోడీ భేటీ: కీలకాంశాలపై చర్చ

తాము చెప్పిన అంశాలను మోడీ ఓపికగా విన్నారని నేతలు మీడియాకు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐదు ప్రధానమైన డిమాండ్లుత ఉంచామని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. రాష్ట్రహోదా, ప్రజాస్వామ్య పునరుద్దరణ, రాజకీయ ఖైదీల విడుదల,  కాశ్మీర్ పండింట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర హోదాకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారన్నారు. 

నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా చెప్పారని  ఈ సమావేశానికి హాజరైన నేతలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేస్తారని మాజీ సీఎం మెహబూబాబా ముఫ్తీ చెప్పారు. ఆర్టికల్  370 పాకిస్తాన్ నుండి పొందలేదన్నారు. నెహ్రు,పటేల్ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.తమ పోరాటం కొనసాగుతుందని తాము ప్రధానిని అభ్యర్ధించామన్నారు. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను ప్రజలు కోరుకొంటున్నారని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

click me!