ఓటేసిన తర్వాత ప్రధాని మోడీ ఎన్నికల సంఘం గురించి ఏమన్నాడంటే?

By Mahesh KFirst Published Dec 5, 2022, 2:17 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఈ రోజు జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపించారు.
 

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో ఆయన ఓటటు వేశారు. నిషాన్ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లుతూ ఆయన కనిపించారు. అందరినీ పలుకరిస్తూ ఆయన క్యూలో నిలుచున్నారు. తన వంతు రాగానే ఓటు వేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన పోలింగ్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న తన అన్న సోమా మోడి ఇంటికి వెళ్లారు. ప్రజాస్వామ్య పర్వదిన వేడుకలు చేసుకుంటున్న ఓటర్లకు, ఎన్నికల సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఈ ప్రజాస్వామ్య పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో నిర్వహించుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య వేడుక జరుపుకుంటున్న దేశ ప్రజలను తాను అభినందిస్తున్నట్టు వివరించారు. ఎంతో ప్రభావవంతంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్‌కూ అతను కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికలు నిర్వహించే సంప్రదాయాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని పెంచిన ఎలక్షన్ కమిషన్‌ను ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశంసించారు.

గుజరాత్ ప్రజలు విచక్షణ కలిగినవారని అన్నారు. వారు అందరి మాటలూ వింటారని, ఏది నిజమో దాన్నే గ్రహిస్తారని వివరించారు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే చాలా మంది ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు అర్థం అవుతున్నదని అన్నారు. గుజరాత్ ఓటర్లకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

Also Read: ఈ రోజు ఉదయమే ఆయన పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల రెండో దశలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని అన్నారు. తాను తన ఓటును ఉదయం 9 గంటలకు అహ్మదాబాద్‌లో వేస్తున్నట్టు తెలిపారు.

ఈ రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్‌లో ఓటు వేస్తారు. అహ్మదాబాద్‌లోని 16 అర్బన్ సీట్లు బీజేపీకి చాలా కీలకమైనవని, 1990ల నుంచి ఈ ఏరియాలో బీజేపీ డామినెన్స్ ఎక్కువగా ఉన్నది.

click me!