కరోనాపై మోడీ సమీక్ష: 23న ఏడు రాష్ట్రాల సీఎంలతో పీఎం భేటీ

By narsimha lodeFirst Published Sep 20, 2020, 3:11 PM IST
Highlights

దేశంలో  ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీన సమావేశం కానున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా కట్టడిపై చర్చించనున్నారు. 

న్యూఢిల్లీ: దేశంలో  ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీన సమావేశం కానున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా కట్టడిపై చర్చించనున్నారు. 

రాష్ట్రాల్లో కరోనా సహాయక చర్యలు, నిధుల విషయమై ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే  ఈ నెల 23వ తేదీన మోడీ మరోసారి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి.  మరో వైపు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా రోగులు అత్యధికంగా రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఆయా రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ లభ్యత తదితర విషయాలపై కేంద్ర నిరంతరం సమీక్షిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 53 లక్షల 08వేల 014కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 42లక్షల 08వేల431 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

click me!