ప్రధాని భూటాన్ పర్యటన: సున్నితమైంది.. భద్రతాపరంగా ప్రాముఖ్యత

By Mahesh KFirst Published Mar 22, 2024, 10:26 PM IST
Highlights

భూటాన్‌, చైనా సరిహద్దు వివాదం విషయమై భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన ప్రాముఖ్యత కలిగిందని మేజర్ జనరల్ సుధాకర్ జీ తెలిపారు. ప్రధాని పర్యటన సున్నితమైందని, భద్రతాపరంగా ప్రాముఖ్యమైందని, అలాగే చాలా ముఖ్యమైనదనీ వివరించారు.
 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన ప్రారంభించారు. ఆయన భూటాన్ రాజధాని థింపూ చేరగానే ఆ దేశ ఉన్నత హోదాలోని వారిని కలిశారు. పొరుగు దేశాలే తొలి ప్రాధాన్యత అనే విధానాన్ని ప్రధాని మోడీ తన పర్యటన ద్వారా ఎత్తిపట్టారు. ఇండియాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఈయన పర్యటనకు ప్రాధాన్యత ఉన్నది. 

ప్రధాని మోడీ ఈ నెల 20, 21వ తేదీల్లో భూటాన్ పర్యటించాల్సింది. కానీ, భూటార్ పారో ఎయిర్‌పోర్టులో వాతావరణ సమస్యలతో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది.

రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు మేజర్ జనరల్ సుధాకర్ జీ (రిటైర్డ్)తో ఏషియానెట్ ఈ పర్యటన గురించి చర్చించింది. క్లుప్తంగా ఈ పర్యటన సున్నితమైందని, భద్రతాపరమైందని, ముఖ్యమైందని సుధాకర్ జీ తెలిపారు.

భూటాన్, చైనాలు తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడు అంచెల రోడ్ మ్యాప్‌ను 2021లో అంగీకరించాయి. ఇది మన దేశ ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందిని కలిగించాయి. వాస్తవానికి ఆ ఒప్పందంలో ఏముందో ఇంకా బయటికి వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు ఆ రెండు దేశాలు సుమారు 25 సార్లు భేటీ అయ్యాయి.

గతంలో వివాదాస్పద ప్రాంతాలను ఇచ్చిపుచ్చుకునే ప్రతిపాదనను భూటాన్ ముందు చైనా పెట్టింది. 1990ల నుంచి చర్చలు జరిగాయి. భూటాన్ దాని పశ్చిమ భాగంలోని (డోక్లాం 89 చదరపు కిలోమీటర్లు, చారితంగ్, సించులుంగ్పా, డ్రామన, శఖటో)లను కావాలనుకుంటే.. ఆ దేశ ఉత్తరంలోని 495 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు వదిలిపెట్టాలి.

‘చైనా ఝాంఫేరి రిడ్జ్‌లో అడుగుపెట్టాలని చూస్తున్నది. ఇది భారత్‌కు కంటగింపుగా ఉన్నది. భారత భద్రతా విషయమై ఇది ఆందోళనకరం కూడా. ఈ ఏరియాలో చైనా అడుగును ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించవద్దు’ అని సుధాకర్ జీ వివరించారు.

click me!