ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. గల్ఫ్ టికెట్ రూపంలో అతడికి జాక్ ఫాట్ తగిలి ఒకేసారి లక్షధికారి అయిపోయాడు. తాజాగా గల్ఫ్ టికెట్ డ్రాలో విజేతలుగా నిలిచింది ఎవరంటే...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆన్ లైన్ గేమింగ్ సంస్థ 'గల్ఫ్ టికెట్' కాసులవర్షం కురిపిస్తోంది. సరికొత్త ఆఫర్లతో మన దేశంలోకి ఎంటరైన ఈ సంస్థ భారతీయుల ఆదరణను చూరగొంటోంది. అతి తక్కువ ఖర్చుతో అధికమొత్తంలో డబ్బులను అందిస్తోంది ఈ గల్ఫ్ టికెట్. ఇలా ఇప్పటికే గల్ఫ్ టికెట్ కొనుగోలుచేసిన అనేకమందికి లక్షలు వరించాయి... తాజాగా మరో ముగ్గురికి జాక్ పాట్ తగింలింది.
గల్ఫ్ టికెట్ నిర్వహించిన తాజా డ్రా లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు విజేతలుగా నిలిచారు. ఫార్ఛ్యూన్ 5, సూపర్ 6 డ్రా లో విజేతలుగా నిలిచినవారి ఒక్కసారిగా లక్షాధికారులయ్యారు. తాము ఊహించనివిధంగా ఒకేసారి లక్షల రూపాయలు రావడంతో ఆ విజేతల ఆనందానికి అవధులు లేకుండాపోయింది... వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శ్రీకర్ సుందర్ ను అదృష్టం వరించింది. అతడు గల్ఫ్ టికెట్ ఫార్చ్యూన్ 5 విజేతగా నిలిచాడు. ఇతడితో పాటు కర్ణాటకకు చెందిన అబ్దుల్ రహీమ్ కూడా విజేతగా నిలిచాడు. వీరు AED 1,00,000 (ఎమిరేట్ దిర్హమ్స్) అంటే అక్షరాలా 22.5 లక్షల రూపాయాలు గెలుచుకున్నారు. ఒకేసారి లక్షలాది రూపాయలు గెలుచుకోవడంతో విజేతల ఆనందానికి అవధులు లేకుండాపోయింది... సోషల్ మీడియా వేదికన తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలా తెలుగబ్బాయి శ్రీకర్ సుందర్ ను అదృష్టం వరించింది.
ఇక సూపర్ 6 డ్రా లొ మరో నలుగురు డబ్బులు గెలుచుకున్నారు. అరుణ్ కుమార్, సైని కృష్ణ, శరత్ చంద్రన్ మరియు సయ్యద్ ఇబ్రహింలు సూపర్ 6 విజేతలుగా నిలిచినట్లు గల్ప్ టికెట్ ప్రకటించింది. వీరు AED 50,000 (ఎమిరేట్ దిర్హమ్స్) అంటే 11.25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలను చెందినవారిని గల్ఫ్ టికెట్ లక్షాధికారులను చేసింది.
ఈ సందర్భంగా గల్ఫ్ టికెట్ మార్కెటింగ్ చీఫ్ జొరాన్ పొపొవిక్ విజేతలకు అభినందనలు తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ నిస్పక్షపాతంగా విజేతలను ఎంపికచేస్తున్నట్లు తెలిపారు. ఎంతో నిజాయితీగా, మరెంతో పాదర్శకంగా గల్ఫ్ టికెట్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.