కాంగ్రెస్ తరపున ‘‘మోడీ’’ ప్రచారం...అవాక్కవుతున్న జనం

By sivanagaprasad kodatiFirst Published Nov 9, 2018, 10:58 AM IST
Highlights

తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం చేయడం ఏంటా అని మీరు అనుకోవద్దు. ఇక్కడ మోడీ అంటే ప్రధాని మోడీ కాదు.. ఆయనలాంటి మరో వ్యక్తి. ఈయన పేరు అభినందన్ పాఠక్

తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం చేయడం ఏంటా అని మీరు అనుకోవద్దు. ఇక్కడ మోడీ అంటే ప్రధాని మోడీ కాదు.. ఆయనలాంటి మరో వ్యక్తి. ఈయన పేరు అభినందన్ పాఠక్.. అచ్చుగుద్దినట్లు ప్రధానిని పోలీ ఉండే ఇతను.. మోడీని అనుకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి తరపున ప్రచారం చేస్తున్నారు..

హావభావాల్లోనూ, ఆహార్యంలోనూ.. ప్రధానిని గుర్తుకు తెస్తూ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో సెంటార్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ప్రసంగాన్ని ప్రారంభించేముందు ‘మిత్రోం’ అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అభినందన్ గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన రిపబ్లికన్ పార్టీ (అధవాల్) ఉత్తరప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

మోడీపై తనకు నమ్మకం లేదని... ఇక అచ్చే దిన్ రాదంటూ.. కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమక్షంలో గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటిదాకా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఆయన.. తాజాగా కమలాన్ని తిడుతూ.. హస్తాన్ని ఆకాశానికెత్తేస్తున్నాడు.

దీనిపై అభినందన్ మాట్లాడుతూ.. ‘‘తాను ప్రధాని మోడీలా కనబడుతుండటంతో ప్రజలంతా అచ్చే దిన్ ఎక్కడా అని పదే పదే అడుగుతున్నారని.. కానీ మనకు మంచి రోజులు రాలేదని... సామాన్యుడి సమస్యలను చూసి చలించిపోయిన తాను బీజేపీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానన్నారు..

అచ్చేదిన్ అన్నది తప్పుడు వాగ్ధానమని తేలిపోయిందన్నారు.. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెలికితీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.

అభినందన్‌ను చూడగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నవంబర్ 12 న బస్తర్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.
 

click me!