పొలంలోని బావి మాయమయ్యింది.. వెతికి పెట్టండి.. పీఎస్ తో వింత కేసు.. అసలుకథేంటంటే...

Published : Jul 07, 2021, 01:57 PM IST
పొలంలోని బావి మాయమయ్యింది.. వెతికి పెట్టండి.. పీఎస్ తో వింత కేసు.. అసలుకథేంటంటే...

సారాంశం

కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఓ వింత కేసు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. ఓ రైతు తన పొలంలో బావి కనిపించిడం లేదని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఓ వింత కేసు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. ఓ రైతు తన పొలంలో బావి కనిపించిడం లేదని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కర్ణాటక రాష్ట్రం, బెళగావి జిల్లాలోని మావినహొండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విని అవాక్కయిన పోలీసులు, అసలేం జరిగిందోనని ఆరా తీశారు. పంచాయతీ అధికారులు రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. ఆ తరువాతే అసలు కథ మొదలయ్యింది.

నీ పొలంలో బావి తవ్వించుకున్నందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు ఇటీవల నోటీసులు అందాయి. దీంతో రైతు అయోమయానికి గురై వాకబు చేస్తే అంతు పట్టలేద. అందుకే ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిశీలించగా పంచాయతీ అధికారుల నిర్వాకం బయటపడింది. 
 
PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?