బీజేపీ నేత ప్రేమ వివాహం..ప్రాణ హాని ఉందంటూ..!

Published : Jul 07, 2021, 01:20 PM IST
బీజేపీ నేత ప్రేమ వివాహం..ప్రాణ హాని ఉందంటూ..!

సారాంశం

 ఓ యువతి.. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది. కాగా.. సదరు యువతి ఓ బీజేపీ కుమార్తె కావడం గమనార్హం. 


ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది. కాగా.. సదరు యువతి ఓ బీజేపీ కుమార్తె కావడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హుబ్లీ బీజేపీ కీలక నేత కుమార్తె మోనల్‌ కొరవి, రాహుల్‌ చందావరకరలు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అమ్మాయి తండ్రి బంధువులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు కమిషనర్‌ లాబురామ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈనెల 2న గదగ్‌ జిల్లా ముండ్రగిలో రిజిష్టర్‌ వివాహం చేసుకొన్నామని, అమ్మాయి తండ్రి పలుకుబడి ఉన్నవారని, ఆయన కారణంగా తమకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం