మళ్లీ విజృంభిస్తున్న కరోనా: రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.30

By Siva KodatiFirst Published Mar 5, 2021, 2:18 PM IST
Highlights

తగ్గిందనుకున్న కరోనా దేశంలో మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకుగాను అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది.

ఇది వరకు రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం ధరలను ఏకంగా రూ.30కి పెంచింది. దీంతో ఒకేసారి రూ.20 పెరిగినట్లయింది. అయితే ఈ ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం తమ బాధ్యత అన్న రైల్వే శాఖ... రైల్వేస్టేషన్లలో జనం విచ్చలవిడిగా గుమిగూడటాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలపై ఇటీవల సమీక్షించిన రైల్వే బోర్డు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలను వెంటనే అమల్లోకి తేవాలని అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది.  

click me!