ప్లాస్టిక్‌పై నిషేధం.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

First Published Aug 3, 2018, 7:09 PM IST
Highlights

ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారి ఆత్మహత్యకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. సమాజంలో ఏ చర్య జరిగినా దాని వెనుక పరోక్ష సంబంధం ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని విధించింది

ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారి ఆత్మహత్యకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. సమాజంలో ఏ చర్య జరిగినా దాని వెనుక పరోక్ష సంబంధం ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని విధించింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భావితరాల భవిష్యత్తు దృష్ట్యా అది మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ప్లాస్టిక్‌ తయారీ దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని ప్రభుత్వ నిర్ణయం దెబ్బతీసింది.

నాగ్‌పూర్‌కి చెందిన నరేశ్ తొలానీ అనే వ్యక్తి హోల్‌సేల్‌గా ప్లాస్టిక్ బ్యాగుల్ని కొనుగోలు చేసి వాటిని రిటైల్‌గా చిన్న చిన్న షాపులకు అమ్మేవాడు. గత 30 ఏళ్లుగా ఆయయన ఇదే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం విధించడంతో కేసులు, జరిమానాకు భయపడి చిన్న చిన్న దుకాణదారులు వాటిని కొనడం మానివేశారు.. దీంతో బ్యాగుల అమ్మకాలు తగ్గిపోవడంతో నరేశ్ ఆర్థికంగా బాగా చితికిపోయాడు.

జూలై 23 నుంచి పూర్తి స్థాయి నిషేధం అమల్లోకి రావడంతో ప్లాస్టిక్ వాడకం దాదాపుగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వేరే వ్యాపారాలు చేయలేక...  అప్పులను తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన నరేశ్ ఇంటి సమీపంలోని సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్‌లో ‘‘ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధంతో అలసిపోయానని.. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని’’ రాశాడు.. ప్రభుత్వం నిషేధానికి కేవలం మూడు నెలలు మాత్రమే గడువు ఇవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నరేశ్ కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
 

click me!