ఆ పైలట్ తన ఫీమేల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు.. డీజీసీఏ యాక్షన్

Published : May 12, 2023, 07:15 PM IST
ఆ పైలట్ తన ఫీమేల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు.. డీజీసీఏ యాక్షన్

సారాంశం

ఢిల్లీ నుంచి దుబాయ్‌కు వెళ్లే ప్రయాణంలో పైలట్.. తన ఫీమేల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి అనుమతించాడు. ఈ విషయం ఆ తర్వాత బయటకు వచ్చింది. ఎయిర్ ఇండియా ఈ ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోకపోవడంతో డీజీసీఏ వద్దకు ఫిర్యాదు వెళ్లింది. తాజాగా డీజీసీఏ యాక్షన్ తీసుకుంది.  

న్యూఢిల్లీ: ఓ పైలట్ తన ఫీమేల్ ఫ్రెండ్‌ను ఏకంగా కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ఢిల్లీ నుంచి దుబాయ్‌కు వెళ్లుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో 2023 ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ విషయం బయటకు వచ్చేది కాదు. కానీ, ఓ సహ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. తొలుత ఈ ఫిర్యాదు ఎయిర్ ఇండియా యాజమాన్యానికి వెళ్లింది. కానీ, వాళ్లు యాక్షన్ తీసుకోలేదు. దీంతో ఆ ఫిర్యాదు డీజీసీఏ వద్దకు వెళ్లింది. తాజాగా, డీజీసీఏ ఆ పైలట్‌పై, ఎయిర్ ఇండియా పై యాక్షన్ తీసుకుంది.

ఆ పైలట్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. చర్యలు తీసుకోనందున ఎయిర్ ఇండియా పైనా రూ. 30 లక్షల జరిమానా వేసింది. అలాగే, కాక్ పిట్‌లోకి వెళ్లిన మహిళ స్టాఫ్ ఆన్ డ్యూటీగా ఉన్నదని తెలిపింది. కాబట్టి, ఆ మహిళపైనా నిర్దిష్ట కాలానికి వర్తించేలా యాక్షన్ తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. స్టాఫ్ ఆన్ డ్యూటీలో ఉండి ప్రయాణికురాలిగా వెళ్లి కాక్‌పిట్‌లోకి వెళ్లడం డీజీసీఏ నిబంధనలకు విరుద్ధమనీ పేర్కొంది.

Also Read: దోమ కుట్టి చనిపోయాడు.. యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే?

తొలుత ఈ విషయంపై ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు.. కొంత కాలం వేచి చూశాడు. కానీ, ఈ ఫిర్యాదుపై యాక్షన్‌కు ఎక్కువ కాలం తీసుకునే అవకాశం ఉన్నదని భావించి డీజీసీఏను అప్రోచ్ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్