డేటింగ్ యాప్‌తో వల: మత్తిచ్చి చోరీ, చివరికిలా..

By narsimha lodeFirst Published Feb 5, 2021, 3:31 PM IST
Highlights

డేటింగ్ యాప్ పేరుతో మగాళ్లకు వల వేసి డబ్బులు  దోచేసిన ఓ కిలాడీ లేడీని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.సోషల్ మీడియా వేదికగా మగాళ్లకు వలవేసి దోచుకొంటుంది.


పుణె:డేటింగ్ యాప్ పేరుతో మగాళ్లకు వల వేసి డబ్బులు  దోచేసిన ఓ కిలాడీ లేడీని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.సోషల్ మీడియా వేదికగా మగాళ్లకు వలవేసి దోచుకొంటుంది.

ఓ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో నిందితురాలు పనిచేసేది. లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది.

ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ టిండర్, బంబుల్ లో తన ప్రొఫైల్ ని ఆమె అప్ లోడ్ చేసింది. ఈ యాప్ ద్వారా పరిచయమైన మగాళ్లను తన మాటలతో నమ్మించేది.

మాటలను కలిపిన వారిని కలుసుకోవాలని హోటల్ గదికి ఆమ్వానించేది. తన కోరిక మేరకు హోటల్ కు వచ్చిన మగాళ్లకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చేది. 

ఈ డ్రింక్ తాగిన వారు మత్తులోకి జారుకొనేవారు. మత్తులో జారుకొన్న వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను ఆమె తీసుకొని పారిపోయేది.

ఇదే తరహాలో ఆశిష్ అనే వ్యక్తిని కూడ హోటల్ కు రప్పించింది. మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చింది. ఈ డ్రింక్ తాగిన ఆశిష్ మత్తులోకి జారుకొన్నాడు.  ఆశిష్ వద్ద ఉన్న బంగారం, డబ్బు మాయమయ్యాయి. నిందితురాలు కన్పించకపోవడంతో జరిగిన మోసం అర్ధమైంది.

దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  విచారణ జరిపారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుండి రూ. 15. 25 లక్షల విలువైన బంగారం, డబ్బు స్వాధీనం చేసుకొన్నారు. ఈ రకంగా సుమారు 16 మందిని ఆమె మోసం చేసినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు.
 

click me!