వరసగా మూడోరోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

First Published Jun 1, 2018, 10:59 AM IST
Highlights

పెట్రోల్ పై 6పైసలు, డీజిల్ పై 5పైసలు

వరుసగా మూడో రోజు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాయి.  ధరలు పెంచేటప్పుడు మాత్రం లీటర్ కి రూపాయిదాకా పెంచిన కంపెనీలు.. తగ్గించేటప్పుడు మాత్రం పైసల్లో తగ్గిస్తోంది.  బుధవారం 1 పైసా మాత్రమే తగ్గించిన  సంగతి తెలిసిందే. కాగా.. గురువారం లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధరలు తగ్గించాయి. శుక్రవారం కూడా ఆయిల్ కంపెనీలు ఇదే రకం ధోరనిని కనపరిచాయి. నేడు లీటర్ పెట్రోల్ పై 6పైసలు, లీటర్ డీజిల్ పై 5 పైసలు తగ్గించాయి.  అంతర్జాతీయంగా ఆయిల్‌ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.29 కి చేరుకోగా.. డీజిల్‌ ధర రూ.69.20గా నమోదైంది. 

16 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్‌పై రూ.3.8, డీజిల్‌పై రూ.3.38 ధర పెరిగింది. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ ఆయిల్‌ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు తాము శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

click me!