మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు

Published : Oct 04, 2018, 07:23 PM IST
మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా ఈ ఇందనాలపై విధిస్తున్న పన్నులు తగ్గించుకుని ప్రజలపై భారాన్ని తగ్గించాలని కేంద్రం సూచించింది. కేంద్ర ఆదేశాలపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది.     

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా పడ్నవీస్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలపై పన్నులు తగ్గించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.50 రూపాయలకు తోడుగా రాష్ట్రం మరో రూ.2.50 తగ్గించింది. దీంతో మొత్తంగా మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధర ఐదు రూపాయలు తగ్గింది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవీస్ ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై విధించే వ్యాట్ ను తగ్గించుకుంటున్నట్లు పద్నవీస్ తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై  రూ.2.50 మేర తగ్గించినందకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి పద్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.  

వీడియో

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే