
UP elections 2022: యూపీలోని జాట్‌లు( జాట్ సామాజిక వర్గం) బిజెపికి మద్దతుగా ఉన్నారనీ, బీజేపీతోనే యూపీలో అభివృద్ది జరుగుతోందని వారికి 100% నమ్మకం ఉందనీ కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు నితిన్ గడ్కరీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, పూర్తి నమ్మకం తనకు ఉందని అన్నారు.
దురదృష్టవశాత్తు.. యూపీ రాజకీయాలు చాలా మారాయనీ, ఓట్లర్లను కులం, మతం, మతం, భాష ఆధారంగా వివక్షకు గురిచేయాలను కుంటున్నారనీ, అలాంటి వివక్ష పూరిత రాజకీయాలను అనుమతించమని గడ్కరీ చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అధ్వాన్నంగా ఉన్నాయని, యోగీ పాలనతో పోల్చితే.. ఆ భేదం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు, యూపీలో గుండా రాజకీయాన్ని తొలిగించిన ఘనత సీఎం యోగి ఆదిత్యనాథ్ కే దక్కుతుందని ఆయన అన్నారు. యోగిపై సామాన్యులకు విశ్వాసం ఉందని, యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం.. అద్భుతం అని ప్రశసించారు. వీరి హాయంలో యూపీలో ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.
రహదారుల విషయానికొస్తే.. ఐదేళ్లలో యూపీలో యూఎస్ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లను తయారు చేస్తామని, యూపీ ప్రజలకు తాను ఇప్పటికే వాగ్దానమిచ్చానని తెలిపారు. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, తద్వార తలసరి ఆదాయం, జిడిపి పెరుగుతోందనీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు అండగా నిలుస్తోందని, యూపీ చెరకు రైతులకు రికార్డు స్థాయిలో ఉన్న బకాయిలు చెల్లించమని గుర్తు చేశారు.
బీజేపీ మేనిఫోస్టో..
బీజేపీ అధికారంలోకి వస్తే ..50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, పేదలకు ప్రతి యేడాది 3 ఎల్‌పీజీ సిలిండర్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది, కొండ ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు రూ.40 వేలు, సీనియర్ సిటిజన్లకు ప్రతినెల రూ.3,600ల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు రూ. 6,000 అందజేత(రెండు సార్లు), పేద కుటుంబాలకు నెలకు రూ. 2వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు, పేద పిల్లలకు నెలకు రూ.1000 అందజేస్తామని తెలిపింది.