రాహుల్ గాంధీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు: కేంద్ర మంత్రి అమిత్ షా

Published : Apr 07, 2023, 04:11 PM IST
 రాహుల్ గాంధీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు:  కేంద్ర మంత్రి అమిత్ షా

సారాంశం

Lucknow: రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వంపై అనర్హత వేటు వేయడంపై పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకున్న తీరును దేశం క్షమించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమిత్ షా శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో 'కౌశంబి ఫెస్టివల్-2023'ని ప్రారంభించిన సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  

Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉత్తరప్రదేశ్ లో 'కౌశాంబి ఫెస్టివల్ 2023'ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వంపై అనర్హత వేటు వేయడంపై పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకున్న తీరును దేశం క్షమించదని పేర్కొన్నారు.  ఒక కుటుంబం వారసత్వ, నిరంకుశ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. "ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వారు (కాంగ్రెస్) అంటున్నారు. ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, మీ కుటుంబమే ప్రమాదంలో ఉంది. భారత్ ఆలోచన ప్రమాదంలో పడకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక వంశం ఆలోచన, మీ (గాంధీ) కుటుంబాన్ని ప్రోత్సహించే మీ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రమాదంలో ఉన్నది భారత ప్రజాస్వామ్యం కాదు.. మీ కుటుంబ నిరంకుశత్వమే ప్రమాదంలో ఉంది" అని అమిత్ షా విమర్శించారు.

 

 

భారతీయ ప్రజాస్వామ్యాన్ని కులతత్వం, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపులతో  కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీ ఎక్కడా కనిపించని రీతిలో కుల రాజకీయాలను ప్రధాని మోడీ ఓడించారన్నారు. ప్ర‌ధాని మోడీ వంశపారంపర్య పార్టీలను ఓడించి బుజ్జగింపులకు ముగింపు పలికడంతోనే ఆయా పార్టీలు భ‌య‌ప‌డుతున్నాయని తెలిపారు. లోక్ సభ సభ్యుడిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై విపక్షాల నిరసనను అమిత్ షా తిప్పికొట్టారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూ సరైన చర్చ లేకుండా బడ్జెట్ సమావేశాలు ముగియలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటును పనిచేయనివ్వకపోవడానికి కారణం రాహుల్ గాంధీని సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడమేనని ఆరోపించారు. 

"సుప్రీంకోర్టు తన తీర్పుతో ఈ చట్టాన్ని అమలు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ ను కాపాడేందుకు మన్మోహన్ సింగ్ దానిని సవరించాలని కోరగా, రాహుల్ అడ్డుకున్నారు. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి అనర్హత వేటు వేసింది. ఇప్పటివరకు 17 మంది సభ్యులను బహిష్కరించగా, రాహుల్ విషయంలోనూ అదే జరిగింది. ఇందుకోసం కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేశారు" అని అమిత్ షా పేర్కొన్నారు. "చట్టాన్ని పాటించడం పౌరులందరి కర్తవ్యం. మీరు పార్లమెంటేరియన్ అని రాహుల్ కు చెప్పాలనుకుంటున్నాను. మీరు శిక్షను సవాలు చేయవచ్చు. కోర్టులో పోరాడవచ్చు. మీరు పార్లమెంటు సమయాన్ని వృథా చేశారు. అందుకు దేశం మిమ్మల్ని క్షమించదు" అని వ్యాఖ్యానించారు.

కాగా, అమిత్ షా ఉత్తరప్రదేశ్ ప‌ర్య‌ట‌న‌లో అజంగఢ్ లో రూ.4,567 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అజంగఢ్ లోని నాందార్ పూర్ లో హరిహర్ పూర్ సంగీత మహావిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?