శబరిమలలో మహిళల ఎంట్రీ: దిగొచ్చిన ట్రావెన్‌కోర్ బోర్డు

By narsimha lodeFirst Published Feb 6, 2019, 3:10 PM IST
Highlights

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తామని  ట్రావెన్ కోరు బోర్డు బుధవారవ నాడు ప్రకటించింది.


తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తామని  ట్రావెన్ కోరు బోర్డు బుధవారవ నాడు ప్రకటించింది.

గత ఏడాది లో కేరళలోని శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను  అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేసింది.

ఈ తీర్పును అమలు చేనేందుకు విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎప్ సర్కార్ విపక్షాల విమర్శలను ఎదుర్కొంది. కనకదుర్గ, బిందులు ఈ ఆలయంలో ప్రవేశించారు.  ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సాంప్రదాయవాదులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

అయితే శబరిమల  ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ చేసింది. సుమారు 50కు పైగా పిటిషన్లపై సుప్రీం విచారణ చేసింది.ఇరు పక్షాల వాదనలను కోర్టు విన్నది.

ఇదిలా ఉంటే  ఆలయంలోని అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తామని అయ్యప్ప దేవాలయానికి చెందిన ట్రావెన్ కోర్ బోర్డు సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది.

click me!