
లక్నో : దేశంలో మహిళలు, యువతుల మీద Sexual assaultsపెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల మీద దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా uttarpradeshలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్ ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ college student ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమె మీద కన్నేశాడు. వెంటనే తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో మరో ఇద్దరు అతడితో కలిసి యువతి మీద సామూహిక gang rapeకి పాల్పడ్డారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఆమె మీద లైంగిక దాడి చేయడమే కాకుండా.. బాధితురాలిని దారుణంగా కొట్టి.. అత్యాచారానికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు ఆమె తెలిపింది.
వారి బారి నుంచి బయటపడిన బాధితురాలు ఎత్మాద్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను భూరా యాదవ్, యశ్ పాల్ గా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ సత్యజిత్ గుప్తా పేర్కొన్నారు. కాగా నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, మార్చి 2న తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళకు Instagram లో రెండు రోజుల క్రితం ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు WhatsAppలో చాటింగ్ చేసుకున్నారు. యువకుడిని నమ్మి అతని వెంట వెళ్లిన మహిళను Molestation చేశాడు’ అని రాజేంద్రనగర్ కనకయ్య తెలిపారు. రాజేంద్రనగర్ పరిధిలోని సులేమాన్ నగర్ లో నివసించి సాజిత్ (27) ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో సంతోష్ నగర్ కు చెందిన ఓ యువతి (20)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు Phone numbers తీసుకుని చాటింగ్ చేసుకున్నారు.
సాజిత్ యువతిని మంగళవారం కలవాలని కోరాడు. రాజేంద్ర నగర్ కు వచ్చిన యువతిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సులేమాన్ నగర్ లో నివసించే అతడి స్నేహితుల ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ సదరు యువతిపై అత్యాచారం చేశాడు. ఆమె డయల్ హండ్రెడ్ కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సాజిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఆ యువతితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని వాట్స్అప్ ద్వారా చాటింగ్ చేశాడు. ఆ తరువాత ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళదామని చెప్పి.. రమ్మని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు ఆమెకు నరకయాతన చూపించాడు. ఆ తరువాత ఆమె వీలు చూసుకుని డయల్ 100కి ఫోన్ చేయడం ద్వారా రాజేంద్రనగర్ పోలీసులు ఆమెను కాపాడారు. నిందితుడిని అదుపులోకి బాధితురాలి ఆస్పత్రికితరలించారు.