Latest Videos

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి ఖాయం.. : అఖిలేష్ యాద‌వ్

By Mahesh RajamoniFirst Published Apr 2, 2023, 11:27 AM IST
Highlights

Kanpur: బీజేపీ ప్రజలకు అన్యాయం చేస్తోందనీ, 2024 లోక్ స‌భ‌ ఎన్నికల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘోర ఓట‌మి త‌ప్ప‌ద‌ని అఖిలేష్ యాదవ్ అన్నారు. కాన్పూర్ పర్యటన సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీపై ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. లోక్ సభలో పెనుమార్పులు కనిపిస్తాయనీ, యూపీలో బీజేపీ ఓడిపోతుందన్నారు.
 

Samajwadi Party President Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రజలకు అన్యాయం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ లో రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు అసంతృప్తిలో ఉన్నారనీ, లోక్ సభలో పెద్ద మార్పు కనిపిస్తుందని, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని అఖిలేష్ యాదవ్ కాన్పూర్ పర్యటనలో అన్నారు.

అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను ఖండించిన ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ మీడియాతో అన్నారు. కాన్పూర్ దేహత్ లో కూల్చివేతల కారణంగా ప్రాణాలు కోల్పోయిన తల్లీకూతుళ్ల గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో మార్పు వచ్చినప్పుడు బీజేపీకి చెందిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని అఖిలేష్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 

యాదవ్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్..

సమాజ్ వాదీ పార్టీ నేత మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, కానీ ఉత్తరప్రదేశ్ ప్రజలు సమాజ్ వాదీ పార్టీని ఉత్తర్ ప్రదేశ్ నుంచి తరిమికొట్టారని పాఠక్ పేర్కొన్నారు. అఖిలేష్ యాద‌వ్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. 

కాన్షీరామ్ విగ్రహా ఆవిష్కరణ..

ఇదిలావుండగా, రాయ్ బరేలీలో ఏప్రిల్ 3న జరిగే కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ విగ్రహాన్ని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆవిష్కరించనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సమాజ్ వాదీ పార్టీ సుస్థిర దళిత ప్రచారంలో భాగంగా చూస్తున్నారు. కాన్షీరామ్ విగ్రహావిష్కరణ అనంతరం అఖిలేష్ యాదవ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తో చేతులు కలపడాన్ని ఎస్పీ జాతీయ అధ్యక్షుడు గుర్తు చేస్తూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు మహానేతల 'నిజమైన అనుచరులు' మరోసారి ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే అవకాశం ఉంది.

click me!