ఫ్రమ్ ది ఇండియా గేట్: టీ బీజేపీలో ఈటల స్పైసీ.. జోక్‌గా మారుతున్న మమత వ్యుహం.. డిబేట్‌లో ఫిరాయింపు..!!

Published : Apr 02, 2023, 11:09 AM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: టీ బీజేపీలో ఈటల స్పైసీ.. జోక్‌గా మారుతున్న మమత వ్యుహం.. డిబేట్‌లో ఫిరాయింపు..!!

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 20వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇన్నోసెంట్లీ.. యువర్స్..
ప్రముఖ మలయాళ నటుడు, మాజీ ఎంపీ ఇన్నోసెంట్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన తన రీల్ ఉనికికి వెలుపలు.. ఎల్లప్పుడూ శాండల్ కలర్‌లో పొడవాటి కుర్తా, ధోతీ ధరించి కనిపించేవారు. లోక్‌సభ సభ్యుడైన తర్వాత కూడా హాస్యం ఆయనకు కవచంగా నిలిచింది. 2014లో సీపీఎం ఆయనను చాలక్కుడి నియోజకవర్గం నుంచి పోటీకి దింపినప్పుడు చాలా మంది గగ్గోలు పెట్టారు. హైస్కూల్ విద్యను కలిగిలేని ఇన్నోసెంట్.. ఓటర్లను అంతలా ప్రభావితం చేస్తారని ఎవరూ ఊహించలేదు. 

ఎన్నికల్లో విజయం తర్వాత ఇన్నోసెంట్..  జీవిత అనుభవం ఉన్న వ్యక్తి మంచి పార్లమెంటేరియన్‌గా ఎలా మారగలరో నిరూపించారు. తన క్యాన్సర్ చికిత్స తర్వాత ఆయన తన నియోజకవర్గం అంతటా క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కేంద్రాలు, ఉపశమన సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవసరాల్లో ఉన్నవారి వద్దకు చేరుకోవడానికి ఆయన అన్ని రాజకీయ, మతపరమైన మార్గాలను కత్తిరించారు. అందుకే ఆయన పనితీరు ప్రత్యేకమైనదిగా నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఇన్నోసెంట్ పదవీకాలం అవినీతి, అక్రమాలు లేని యుగంగా గుర్తుండిపోతుంది. ఇన్నోసెంట్‌ను అన్ని పార్టీలు, నాయకులు రాజకీయ గ్రంథంగా మళ్లీ చదవగలరు. ఎందుకంటే.. ప్రజలతో కనెక్ట్ కావడానికి సరళతను భావజాలంగా, చిరునవ్వును పాస్‌వర్డ్‌గా ఉపయోగించే ఇన్నోసెంట్ వంటి నాయకులు చాలా మంది లేరు.

సెంటెనరీ బ్లూస్..
వైకోమ్ సత్యాగ్రహం శతాబ్ది.. మహాత్మా గాంధీ మద్దతిచ్చిన, జాతీయ నాయకులచే ప్రేరేపించబడిన ఉద్యమం ఇది. దేశ చరిత్రలో ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకోమ్ శివాలయం సమీపంలోని రహదారులను వెనుకబడిన తరగతులు ఉపయోగించుకునే హక్కును పొందే ప్రయత్నంలో భాగంగా ఈ సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహం ప్రారంభానికి ముందు గాంధీజీ వైకోమ్‌కు వచ్చారు.

వైకోమ్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. అయితే రాహుల్ గాంధీకి మద్దతును అభ్యర్థించడానికి.. వెనుకబడిన తరగతులకు వారి హక్కులను అందించిన ఉద్యమం 100వ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించడంలోని లాజిక్‌ను చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. ‘‘ఒక నిర్దిష్ట సమాజంపై అజాగ్రత్త వ్యాఖ్య చేసినందుకు రాహుల్ గాంధీ ఈ పరిస్థితికి చేరుకున్నారు. కనీసం వేదికపైనా ఈ పోస్టర్ షోను తప్పించి ఉండాల్సింది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు.

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: రాజకీయ డిక్షనరీలో నైట్ డ్యూటీ అలవెన్స్.. అఖిలేష్ వ్యుహంపై పార్టీ నేతల ఆశ్చర్యం..!

ఇక, వైకోమ్ సత్యాగ్రహం జరిగిన కనీసం 40 సంవత్సరాల తరువాత స్థాపించిన సీపీఎం పార్టీ.. ఉద్యమంపై పితృత్వాన్ని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం ఇంకా విచిత్రమనే చెప్పాలి.

స్టాప్ ప్రెస్..
టీవీల అనంతర కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధానాంశం త్రైపాక్షిక చర్చలు. స్థానిక సమస్యల నుంచి జాతీయ సమస్యల వరకు అంశాలను ఇందులో  చర్చిస్తుంటారు. అయితే ఎక్కడా లేని ఆవేశపూరిత చర్చలు ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయనున్న రామనగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవలి ఎపిసోడ్‌లలో ఒకటి పార్టిసిపెంట్‌ల ‘‘ఫిరాయింపు’’ కోసం గుర్తుండిపోతుంది.

వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు, కేవలం నలుగురు జేడీఎస్ కార్యకర్తలు ‘‘ హాట్ ’’ చర్చలో పాల్గొన్నారు. నిర్వాహకులు కొంతసేపు వేచి చూసినా కొత్త జేడీఎస్ కార్యకర్త ఎవరూ రాలేదు. ఈ క్రమంలోనే షో వీక్షించేందుకు అక్కడకు వచ్చిన ముగ్గురు జర్నలిస్టులను జేడీఎస్ కార్యకర్తలతో కలిసి షోలో పాల్గొనాలని కోరారు. 

చర్చ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లో.. జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి పంచరత్న యాత్రను చేపడుతున్నారని ఆ పార్టీ కార్యకర్త ఒక్కరు ఉదహరించారు.  తమ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడానికి కాంగ్రెస్, బీజేపీల మాదిరిగా ప్రజలకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు జేడీఎస్ కార్యకర్తలుగా మారిన ముగ్గురు జర్నలిస్టులను తమ వైపుకు ఆహ్వానించి.. ఆ శిబిరాన్ని ఖాళీ చేయించారు.

జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచే చేసేది ఇదేనని కాంగ్రెస్‌ నేత విమర్శించారు. అయితే ఆ ముగ్గురూ జర్నలిస్టులేనని.. తమ పార్టీవారు కాదని జేడీఎస్‌ కార్యకర్త ఒకరు ఒప్పుకున్నారు. ‘‘ఇది ఎన్నికల సమయంలో జర్నలిస్టుల ఫిరాయింపులు తప్ప మరొకటి కాదు’’అని జేడీఎస్‌కు చెందిన మరో కార్యకర్త అన్నారు. 


లోటస్ పికిల్..
ఊరగాయలకు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాజకీయాలు కూడా ప్రతి స్కూప్‌లో అదే చిటికెడు స్పైసీ(ఊరగాయలలో ఉండే స్పైసీ) దాచిపెడతాయి. బీజేపీలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు జాతీయ నాయకుల గుండెల్లో ఇలాంటి మండే సంచలనాన్ని మిగిల్చాయి. బీజేపీలోకి కొంతకాలం క్రితం చేరిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, రాష్ట్రంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ ఇందుకు కారణం.

ఈటల రాజేందర్ బీజేపీ చేరడానికి అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్)కి రాజీనామా చేశారు. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. అయితే పార్టీ తన మద్దతుదారులకు టిక్కెట్లు సహా ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చకపోవడంతో.. రాజేందర్ చేరిక కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తాననే హెచ్చరికలను పంపినట్టుగా తెలుస్తోంది.

తన రాజీనామా ఉద్దేశాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా పంచుకున్నారు. సమర్ధులకు టిక్కెట్లు ఇస్తామని నడ్డా.. రాజేందర్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా అసంతృప్తితో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో టీ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారినట్లే కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమితో ఆ పార్టీ ఊపును కోల్పోయింది. ఆ తర్వాత పెద్ద నేతలెవరూ బీజేపీలో చేరకపోవడంతో సీనియర్‌ నేతల్లో నెలకొన్న అసంతృప్తి ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీలోని అసంతృప్తికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పనితీరేనన్న టాక్ కూడా వినిపిస్తుంది. త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వం ఈ పరిణామాలపై దృష్టి సారిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

శుభ్రమైన నీటితో కడగాలి.. 
మురికి నారను కడగడం ఇష్టమైన రాజకీయ కాలక్షేపం. కానీ మమతా బెనర్జీ వాషింగ్ మెషీన్‌తో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని బెదిరిస్తూ ఊరేగితే అది జోక్‌గా మారుతుంది. ధరల పెరుగుదల, ప్రతిపక్ష పార్టీలను అణిచివేస్తున్నారని ఆమె కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే సొంతగడ్డపై ఇలాంటి కారణాలతోనే ఆమెకు వ్యతిరేకంగా కడిగివేసే మోడ్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మమత బెనర్జీకి, ఆమె అత్యుత్సాహానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు సువేందు అధికారి, సుకాంత్ మజుందార్‌లు ధర్నాకు దిగారు. అయితే బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వామపక్ష పార్టీల దుస్థితి దయనీయంగా ఉంది. మోదీ, మమతా విభజనలను ద్విముఖ వ్యూహంతో వారు వ్యతిరేకించాలి. ఈ పోరు ఘర్షణలో ప్రత్యర్థిపై ఉన్నతమైన వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందగలిగే అవకాశం కలిగి ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం