కేంద్ర బడ్జెట్.. మూడింతలు కానున్న పింఛన్ నిధులు

By ramya neerukondaFirst Published Feb 1, 2019, 10:31 AM IST
Highlights

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులను ఆకర్షించేలా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. పింఛన్లపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.
 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ని ఈ రోజు ప్రవేశపెట్టనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. కాగా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులను ఆకర్షించేలా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. పింఛన్లపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.

పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల నిధులను  మూడింతలు చేయనున్నట్లు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లు ఈ పింఛన్లకు కేటాయించే అవకాశం ఉంది. దివ్యాంగులు, వితంతువులు తదితరులకు ఇప్పటి వరకు నెలకు రూ.200 ఇస్తుండగా.. దానిని కేంద్రం పెంచనుంది. ప్రస్తుతం రెండు కోట్ల మందికి దీని ద్వారా ప్రయోజనం కలుగుతుండగా.. ఆ సంఖ్యను మూడు కోట్ల కు పెంచాలని కేంద్రం భావిస్తోంది.
 

click me!