రెండోసారి సీఎం ప్రమాణం చేసిన పెమా ఖండూ

Siva Kodati |  
Published : May 29, 2019, 04:30 PM IST
రెండోసారి సీఎం ప్రమాణం చేసిన పెమా ఖండూ

సారాంశం

అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పెమాఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం గవర్నర్ బీబీ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పెమాఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం గవర్నర్ బీబీ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 41 స్థానాలు గెలుపొందింది.

దీంతో భారతీయ జనతాపార్టీ తొలిసారి అరుణాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అసోం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్