పాయల్ కులం కూడా మాకు తెలీదు... నిందితులు

By telugu teamFirst Published May 31, 2019, 1:08 PM IST
Highlights

ముంబయిలో కలకలం రేపిన డాక్టర్ పాయల్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా... తమకు అసలు పాయల్ కులమేంటో కూడా తెలీదని వారు చెప్పడం గమనార్హం.

ముంబయిలో కలకలం రేపిన డాక్టర్ పాయల్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా... తమకు అసలు పాయల్ కులమేంటో కూడా తెలీదని వారు చెప్పడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి సెంట్రల్‌లో పాయల్‌ సల్మాన్‌ తాడ్వి అనే 23 ఏళ్ల యువతి గైనకాలజి విభాగంలో పోస్టు గ్రాడ్యూయేషన్‌ చేస్తోంది. బీవైఎస్‌ నాయర్‌ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లు తరచూ కులం పేరుతో పాయల్‌ను వేధింపులకు గురిచేసేవారు.

వేధింపులు తీవ్రస్థాయికి చేరుకోవటంతో మనస్తాపానికి గురైన పాయల్..హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేధింపులపై ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. వేధింపులకు పాల్పడిన ముగ్గురు సీనియర్‌ వైద్యులు హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా.. దర్యాప్తులో తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వారు చెబుతుండటం విశేషం.

కాగా... ఈ ముగ్గురు డాక్టర్లు.. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఇదిలా ఉండగా... పాయల్ ఆత్మహత్య కాదు... హత్య అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 

click me!