పతంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు, అల్లోపతి వైద్యమే... !

By AN TeluguFirst Published May 25, 2021, 9:59 AM IST
Highlights

సునీల్ కి జరిగిన  కొవిడ్‌-19 ట్రీట్మెంట్ లో పతంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.  50ఏళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. 

అల్లోపతి మందుల మీద రామ్ దేవ్ బాబా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దీనిమీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే రామ్ దేవ్ బాబా క్షమాపణలు చెప్పి.. ఆ వివాదానికి తెరదించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ విషయంలో రామ్ దేవ్ బాబా సమయోచితంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. 

అయితే రామ్ దేవ్ బాబా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పినా.. ఆ వెంటనే ఆయన ఐఎంఏకు 25 ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డైరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్‌ బన్సాల్‌ కరోనాతో చనిపోవడంతో.. తమ వైద్య విధానంపై విమర్శలు రాకముందే.. ముందస్తు జాగ్రత్తగా పతంజలి స్పందించింది. 

సునీల్ కి జరిగిన  కొవిడ్‌-19 ట్రీట్మెంట్ లో పతంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.  50ఏళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. 

ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్‌ ట్రీట్మెంట్తో పతంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం.. అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతంజలి మరోసారి అల్లోపతి వైద్య విధానం పై సెటైర్  వేసినట్లయింది.

బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసిది. ఈ మేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి  చెప్పారు. 

click me!