చాక్లెట్ తో ఎలక్ట్రిక్ కారు... నెటిజన్లు ఫిదా...!

By telugu news team  |  First Published Mar 17, 2023, 10:50 AM IST

ఓ చెఫ్... తన టాలెంట్ తో చాక్లెట్ తో ఎలక్ట్రిక్ కారును తయారు చేశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అతని టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
 


ఈ రోజుల్లో కొంచెం టాలెంట్ ఉంటే చాలు.. ఇంటర్నెట్ ని షేక్ చేయవచ్చు. చాలా కొద్ది సమయంలోనే ఫేమస్ అయిపోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది విభిన్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను ఉపయోగించి తన టాలెంట్ ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా ఓ చెఫ్... తన టాలెంట్ తో చాక్లెట్ తో ఎలక్ట్రిక్ కారును తయారు చేశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అతని టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Latest Videos

undefined

A post shared by Amaury Guichon (@amauryguichon)


వీడియోతో పాటు, "చాక్లెట్ ఎలక్ట్రిక్ కార్! సంపూర్ణ సౌష్టవంతో కూడిన చాక్లెట్ వస్తువును హ్యాండ్‌క్రాఫ్ట్ చేయడం అంత సులభం కాదు..." అని ఆయన క్యాప్షన్ లో పేర్కొన్నాడు.

వీడియోలో, అతను మొదటి నుండి చాక్లెట్ ఎలక్ట్రిక్ కారును ఎలా తయారు చేశాడో చూపించాడు. ఎలక్ట్రిక్ కారు తయారీలో చెఫ్ అనేక రకాల సాంకేతికతలను, చాక్లెట్ రకాలను ఉపయోగించారు. కేక్ మీద ఐసింగ్ కూడా చేశాడు. కాగా.... అతని వీడియోకి నెటిజన్లు మాత్రమే కాదు.... ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యూందాయ్ కూడా స్పందించింది.

ఈ కారు కింద కామెంట్ గా.... ఇది ఒక స్వీట్ రైడ్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. కాగా... నెటిజన్లు మాత్రం ఆ చెఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతను పడిన కష్టాన్ని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

click me!