భార్యలను వదిలేసిన భర్తలు.. పాస్ పోర్టులు రద్దు

Published : Mar 05, 2019, 10:53 AM IST
భార్యలను వదిలేసిన భర్తలు.. పాస్ పోర్టులు రద్దు

సారాంశం

ఇటీవల కాలంలో.. చాలా మంది ఎన్ఆర్ఐలు తమ భార్యలను వదిలేస్తున్నారు.

ఇటీవల కాలంలో.. చాలా మంది ఎన్ఆర్ఐలు తమ భార్యలను వదిలేస్తున్నారు. కాగా.. అలా  భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించినట్లు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు వెల్లడించారు. 

మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్‌పోర్ట్‌ చట్టం, 1973 నాటి క్రిమినల్‌ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!