సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ... కూల్చేసిన భారత సైన్యం

Siva Kodati |  
Published : Mar 05, 2019, 07:31 AM IST
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ... కూల్చేసిన భారత సైన్యం

సారాంశం

భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు సరిహద్దులపై డేగ కన్ను వేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. 

భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు సరిహద్దులపై డేగ కన్ను వేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్ధాన్‌లోని బికనీర్ నల్ సెక్టార్‌లోకి ఓ గుర్తు తెలియని డ్రోన్ ప్రవేశించినట్లు భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దానిని గుర్తించారు.

దీనిపై అప్రమత్తమైన సైన్యం సోమవారం ఉదయం 11.30 గంటలకు సుఖోయ్ 30 ఏంకేఐ ద్వారా ఆ డ్రోన్‌ను కూల్చేసింది. కాగా బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత రోజు గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని నలియా ఎయిర్‌బేస్‌కు సమీపంలో  పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu