పంచవటి ఎక్స్‌ప్రెస్‌ లూటీ.. అద్దాలు, డస్ట్ బిన్‌లను దోచుకున్న ప్రయాణికులు

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 12:02 PM IST
Highlights

ముంబై-గోవాల మధ్య నడిచే తేజాస్ ఎక్స్‌ప్రెస్‌ లగ్జరీగా ఉండటంతో.. సౌకర్యాలను వినియోగించుకోవాల్సిన ప్రయాణికులు.. రైలును దోచుకున్న సంగతి తెలిసిందే

ముంబై-గోవాల మధ్య నడిచే తేజాస్ ఎక్స్‌ప్రెస్‌ లగ్జరీగా ఉండటంతో.. సౌకర్యాలను వినియోగించుకోవాల్సిన ప్రయాణికులు.. రైలును దోచుకున్న సంగతి తెలిసిందే.. రైలులోని ఎల్‌సీడీ స్క్రీన్లను, హెడ్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు.

మే 25, 2017న జరిగిన ఈ సంఘటన రైల్వే వర్గాలను షాక్‌కు గురిచేసింది. రైలును తమ సొంత ఆస్తిలా భావించాలని.. లోపలి వస్తువులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తాజాగా ముంబై-నాసిక్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే తరహా దోపిడికి పాల్పడ్డారు ప్రయాణికులు.

ట్రే టెబుల్స్, కిటికీలు, రెగ్యులేటర్లు, కుళాయిలు, అద్దాలు, డస్ట్‌బిన్‌లను దోచుకెళ్లారు. వరుస సంఘటనలతో రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌకర్యవంతమైన సర్వీసులను తీసివేయాలని భావిస్తోంది. దీనిపై రైల్వే ప్రయాణికుల సంఘం స్పందించింది.

రైల్వే ట్రాకులపై రోజు చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని.. ముంబై సబర్బన్ రైళ్లను ఆపివేస్తున్నారా అని ప్రశ్నించింది. సౌకర్యాలనను తీసివేస్తే.. టిక్కెట్ ధరను కూడా తగ్గించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
 

click me!