మీ డబ్బులు కిందపడ్డాయంటూ.. ముఖ్యమంత్రి పీఏ పర్సు చోరీ

Published : Sep 18, 2018, 11:41 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
మీ డబ్బులు కిందపడ్డాయంటూ.. ముఖ్యమంత్రి పీఏ పర్సు చోరీ

సారాంశం

కేటుగాళ్లు ఏకంగా ముఖ్యమంత్రి పీఏకే టోకరా పెట్టారు. పోలీసులు పక్కనుండగానే పీఏ పర్సును ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద పీఏగా పనిచేస్తోన్న నిధి కందార్ నిన్న ముంబై కొలబాలోని ఓ స్టార్ హోటల్‌కు వచ్చారు.

కేటుగాళ్లు ఏకంగా ముఖ్యమంత్రి పీఏకే టోకరా పెట్టారు. పోలీసులు పక్కనుండగానే పీఏ పర్సును ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద పీఏగా పనిచేస్తోన్న నిధి కందార్ నిన్న ముంబై కొలబాలోని ఓ స్టార్ హోటల్‌కు వచ్చారు. ఆమెకు భద్రతగా పోలీసులు కూడా ఉన్నారు..

హోటల్‌లో పని ముగించుకుని తిరిగి వెళుతూ.. పక్కనే ఉన్న స్టోర్‌కి వెళ్లారు. ఈ సమయంలో కానిస్టేబుల్ డ్రైవింగ్ సీట్లో ఉండగా.. ఓ గుర్తు తెలియని దుండగుడు వచ్చి మీ డబ్బు రోడ్డుపై పడిందని చెప్పాడు. డ్రైవర్ కారు దిగగానే మరో వ్యక్తి వచ్చి కారులో ఉన్న నిధి పర్సు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.

డ్రైవర్ తిరిగి చూసుకునేలోపు దుండుగులు అక్కడి నుంచి పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. చోరీకి పాల్పడింది టక్ టక్ దొంగల ముఠా సభ్యులుగా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works