అండర్ వేర్ లో బంగారం.. చెన్నై ఎయిర్ పోర్టులో స్వాధీనం.. !

By AN TeluguFirst Published Jul 1, 2021, 9:46 AM IST
Highlights

చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి లో దుస్తుల్లో తీసుకొచ్చిన 31 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

బంగారం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. రోజులు లక్షల రూపాయల విలువైన బంగారం పట్టుబడుతూనే ఉంది. అయినా స్మగ్లర్లు వెనకాడడం లేదు. ఏదో ఒక రకంగా బంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తునారు. దీనికోసం వింతవింత దారులు వెతుకుతున్నారు.

తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనలో అండర్ వేర్ లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న  వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెడితే...

చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి లో దుస్తుల్లో తీసుకొచ్చిన 31 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాకం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం బుధవారం ఉదయం చేరుకుంది.  

ఇందులో పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్నట్లు కష్టం శాఖ కమిషనర్ కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కడలూరు కు చెందిన బస్సులు ది 26న పరిశీలించగా అతనిలో దుస్తుల్లో 31 లక్షల 50 వేల విలువైన ఆరువందల యాభై గ్రాముల బంగారం తీసుకొస్తున్నట్లు గుర్తించారు దీంతో పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
 

click me!