
తాము బండి మీద వెళుతూ.. కుక్కను మాత్రం దాని మెడకు బెల్టు కట్టి లాక్కెళ్లారు ఇద్దరు మహిళలు. కాగా... వారిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రం పరిటాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చంచల్, సోనియాలు.. తమ కుక్క మెడకు బెల్టు వేసి.. దానిని స్కూటీకి కట్టేశారు. అనంతరం వారిద్దరూ స్కూటీ పై వెళ్లారు. ఆ కుక్క స్కూటీ వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. కాగా.. దీనికి సంబంధించి వీడియో సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.
జూన్ 20వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా.. కుక్కను అలా లాక్కెళ్లడంతో అది తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో జూన్ 24న అది తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. జంతు సంరక్షణ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. కుక్క పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. వారిద్దిరినీ అరెస్టు చేయగా.. వారు బెయిల్ పై బయటకు వచ్చారు.