చిన్న బ్యాగులో మూగ జీవాలను కుక్కి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్.. పాపం  ఆ జీవులు ఎలా ఉన్నాయో చూడండి..

Published : Oct 26, 2022, 04:17 AM IST
చిన్న బ్యాగులో మూగ జీవాలను కుక్కి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్.. పాపం  ఆ జీవులు ఎలా ఉన్నాయో చూడండి..

సారాంశం

మూగజీవాల్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని  చెన్నై ఎయిర్ పోర్టులోని  కస్టమ్స్ అధికారులు  పట్టుకున్నారు.అతడి నుంచి ముంగిసను, కాస్కస్ అనే మరో మూగజీవాన్ని పట్టుకున్నారు. వీటిని ఆ స్మగ్లర్ థాయ్‌లాండ్ నుంచి తీసుకవచ్చినట్టు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా జరిపిన తనిఖీలో వీరి బండారం బయటపడింది.   

అటవీ జంతువులను ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా చేయాలంటే.. అంతర్జాతీయంగా అనేక ఆంక్షలుంటాయి. వాటి రవాణా కోసం  ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా.. కొన్ని జీవులను మాత్రమే తీసుకెళ్లాడానికి అనుమతిస్తారు. ఇలాంటి ఆంక్షల నేపథ్యంలో స్మగ్లర్లు.. జంతువుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న బ్యాగుల్లో మూగజీవాల్ని దాచి  తీసుకెళ్తుంటారు.వాటి మరణాలకు కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో  కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతుంటాయి.

తాజాగా తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని మూగజీవాల్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి అరుదైన ఐదు మూగజీవాన్ని జప్తు చేశారు. ఓ వ్యక్తి  మూగ జీవాలను అక్రమంగా థాయ్‌లాండ్ నుంచి చెన్నైకి తీసుకువచ్చారని సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా జరిపిన తనిఖీలో వీరి బండారం బయటపడింది.

అనుమానస్పదంగా వ్యవహరించిన ప్రయాణీకుడ్ని తనిఖీ చేయగా..  చిన్న బ్యాగులో తీసుకువస్తున్న మూగ జీవాలను కస్టమ్స్ అధికారులు  గుర్తించారు.  జంతువులతో పాటు ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న జంతువులలో కొన్ని చిన్న ముంగిస, ప్రత్యేక జంతువు కస్కస్ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

ఈ సంఘటన గురించి చెన్నై కస్టమ్స్ ట్వీట్ చేస్తూ..“అక్టోబర్ 23 న బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి చెన్నై కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని లాగేజ్ లో  దాచిన ఐదు చిన్న ముంగిసలు, కస్కస్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌లాండ్‌కు తిరిగి పంపారు.ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ముంగూస్.. అతి చిన్న ఆఫ్రికన్ మాంసాహార జంతువు. చిన్న అవయవాలు, పొడవాటి పంజాలు, పొడవాటి తోక, చిన్న చెవులు కలిగి ఉంటాయి.వారి మృదువైన శరీరం అందర్నీ ఆకర్షిస్తోంది. 

గతంలోనూ ఇలాంటి ఉదంతాలు  

 గత వారం ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), కస్టమ్స్ అధికారులు   600 పైగా అన్యదేశ జాతులను రక్షించారు.అక్రమంగా రవాణా చేయబడిన జంతువుల్లో అరుదైన బల్లులు, కొండచిలువలు,ఇగువానాస్‌తో సహా దిగుమతి చేసుకున్న సజీవ చేపల సరుకులో దాచబడ్డాయి. రక్షించే సమయంలో 100 కంటే ఎక్కువ జంతువులు చనిపోయాయని, చేపల దిగుమతి, రవాణాకు ఉపయోగించే కంటైనర్లలో ఉంచడం వల్ల చాలా జంతువుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు తెర మీదకి వచ్చాయి. వైట్ కస్కస్ అని కూడా పిలువబడే సాధారణ మచ్చల కస్కస్ ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణీకుడిని పట్టుకున్నారు. ఇవి ఆస్ట్రేలియాలోని కేప్ యార్క్ ప్రాంతం, న్యూ గినియా సమీపంలోని చిన్న ద్వీపాలలో కనిపిస్తాయి. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?