కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన పశుపతి పరాస్.. ఎందుకంటే.. ?

By Sairam Indur  |  First Published Mar 19, 2024, 3:04 PM IST

రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధినేత, పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ సీట్ల సర్దుబాటు విషయంలో తనకు, తన పార్టీకి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.


కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. బీహార్ లో రాబోయే లోక్ సభ ఎన్నికల సీట్ల కేటాయింపుకు సంబంధించి తన అన్న కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పతంజలి ప్రకటనల కేసు.. విచారణకు రావాలని రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు ఆదేశం

Latest Videos

లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రామ్ విలాస్) 5 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సోమవారం ప్రకటించింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.

ఈ విషయంలో పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత కంటే ముందు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాజీనామా చేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో ఏకైక మిత్రపక్షంగా ఉన్న ఆయన ప్రధానిని పెద్ద నాయకుడిగా అభివర్ణించారు. ఎన్డీఏకు నిజాయితీగా, నమ్మకంగా సేవ చేసినప్పటికీ సీట్ల పంపకం ఒప్పందంలో తనకు, తన పార్టీకి అన్యాయం చేసిందని ఆరోపించారు.

బీజేపీ పొలిటికల్ వింగ్ ఈడీ.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కుట్ర - ఆమ్ ఆద్మీ పార్టీ..

‘‘నిన్న ఎన్డీయే కూటమి బీహార్ లోక్ సభకు 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. నేను చాలా చిత్తశుద్ధితో పనిచేశాను. నాకు, మా పార్టీకి అన్యాయం జరిగింది. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’’ అని పరాస్ పేర్కొన్నారు.

తమిళిసై రాజీనామా ఆమోదం: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం

కాగా.. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 2000 సంవత్సరంలో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. రామ్ విలాస్ పవన్ మరణం తరువాత చిరాగ్, పరాస్ మధ్య తీవ్రమైన వివాదం తలెత్తడంతో ఆ పార్టీ 2021 అక్టోబర్ లో రెండు వర్గాలుగా చీలిపోయింది. అందులో ఒకటి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కాగా మరొకటి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ. రామ్ విలాస్ పాశ్వాన్ చిరాగ్ కుమారుడుకాగా.. పరాస్ సోదరుడు.

click me!