ముగిసిన పార్లమెంటు సమావేశాలు.. 20 బిల్లులకు ఆమోదం: లోక్ సభ స్పీకర్

Published : Aug 12, 2023, 04:56 AM IST
ముగిసిన పార్లమెంటు సమావేశాలు.. 20 బిల్లులకు ఆమోదం: లోక్ సభ స్పీకర్

సారాంశం

పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జులై 20వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు 17 రోజులపాటు సాగాయి. మణిపూర్ అంశం కేంద్రంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం కూడా విపక్షాలు ప్రవేశపెట్టాయి. అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది.  

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మఱిపూర్ అంశం ప్రధానంగా విపక్షాలు ఈ సమావేశాల్లో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మణిపూర్ హింసపై పార్లమెంటులో మాట్లాడించాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు చివరకు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేసే వరకు వెళ్లాయి. ఎంపీల సస్పెన్షన్‌లతో ఈ సమావేశాలు ముగిశాయి.

జులై 20వ తేదీన మొదలన ఈ సమావేశాలు 17 రోజులపాటు సాగాయి. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్ సభను వాయిదా వేయడంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. దిగువ సభ 44 గంటలపాటు సాగిందని ఆయన వివరించారు. ఈ కాలంలో 20 బిల్లులు, 22 తీర్మానాలకు ఆమోదం లభించిందని తెలిపారు.

Also Read: IPCకి బదులు భారతీయ న్యాయ సంహిత.. శిక్షా స్మృతులను మారుస్తూ మూడు బిల్లులు

ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో తొలిసారిగా కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతను సస్పెండ్ చేశారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియా కూటమి సభ్యులు శుక్రవారం వాకౌట్ చేసి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. శుక్రవారం రోజున ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !