
Opposition leaders 50-Hour-Long Protest: వర్షకాల పార్లమెంట్ సమావేశాలు దేశ రాజకీయాల్లో హీటును పెంచుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేల పలు ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై చర్చకు పిలుపునిస్తుండగా.. పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్బంగా unruly behaviour కారణంగా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 20 మంది ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంటు కాంప్లెక్స్‌లో 50 గంటలపాటు నిరసన ప్రారంభించారు. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై తక్షణమే చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని పేర్కొంటూ ప్రతిపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
"ఎంపీలు గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరసనను నిర్వహిస్తున్నారు. రాత్రంతా ఆ స్థలంలోనే ఉంటారు" అని సస్పెండ్ అయిన పార్లమెంటేరియన్లలో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ డోలా సేన్ చెప్పినట్లు PTI పేర్కొంది. 20 మంది ఎంపీల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నుంచి ముగ్గురు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నుంచి ఇద్దరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అంతకుముందు రోజు AAP ఎంపీ సంజయ్ సింగ్ ఒక కాగితం చింపి దాని ముక్కలను కుర్చీ వైపు విసిరినందుకు రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ సింగ్.. మిగిలిన వారం రోజుల పాటు సభ నుండి సింగ్ ను సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
జులై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్ష శాసనసభ్యులు నిరంతరాయంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సోమవారం లోక్‌సభ నుండి మిగిలిన సెషన్‌కు సస్పెండ్ అయ్యారు. మరోవైపు ప్రతిపక్ష నేతల బృందం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ సమావేశంలో సభా నాయకుడు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. క్షమాపణలు చెబితే తప్ప ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఈ సమావేశంలో వెంకయ్య నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రతిపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే, కేసీ. వేణుగోపాల్, ఎన్సీపీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి చెందిన డెరెక్ ఓ'బ్రియన్, డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, శివసేనకు చెందిన సంజయ్ రౌత్, సీపీఎంకు చెందిన ఎలమరం కరీం, సీపీఐకి చెందిన బినోయ్ విశ్వం, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కు కి చెందిన సురేష్ రెడ్డి, ఎండీఎంకేకు చెందిన వైకో ఉన్నారు.