మణిపూర్‌పై విపక్షాల నిరసన: రాజ్యసభ మరోసారి వాయిదా

Published : Jul 31, 2023, 02:25 PM IST
మణిపూర్‌పై విపక్షాల నిరసన: రాజ్యసభ మరోసారి వాయిదా

సారాంశం

మణిపూర్ అంశంపై రాజ్యసభలో విపక్షాలు నిరసనకు దిగాయి.  పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు పట్టబట్టారు.  దీంతో  రాజ్యసభను  మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు  సభను రాజ్యసభ చైర్మెన్ వాయిదా వేశారు.

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై  విపక్షాల నిరసనలతో  రాజ్యసభలో  గందరగోళ పరిస్థితులు  నెలకొన్నాయి.  దీంతో  రాజ్యసభ ప్రారంభమైన కొద్దిక్షణాల్లోనే రాజ్యసభను మధ్యాహ్నం రెండున్నర గంటలకు  వాయిదా వేశారు. 

ఇవాళ ఉదయం పార్లమెంట్ 11 గంటలకు  రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభ ప్రారంభమైన  తర్వాత  మణిపూర్ అంశంపై  విపక్షాలు నిరసనకు దిగాయి.మణిపూర్ అంశంపై  చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాజ్యసభలో సభా నాయకుడు  పీయూష్ గోయల్  ప్రకటించారు. అయితే  స్వల్పకాలిక చర్చ వద్దని  విపక్షాలు కోరుతున్నాయి. పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించాలని  డిమాండ్  చేస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు  రాజ్యసభను వాయిదా పడింది.  రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు  ప్రారంభమైన తర్వాత కూడ ఇదే పరిస్థితి నెలకొంది.  విపక్ష సభ్యులు తమ డిమాండ్ నుండి  తగ్గలేదు. స్వల్పకాలికి చర్చను ప్రారంభించాలని  రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్   కోరారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం దీనికి అంగీకరించలేదు. విపక్ష సభ్యులు నిరసనను కొనసాగించారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దరిమిలా  రాజ్యసభను చైర్మెన్ జగదీప్ ధన్ కర్ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాయిదా వేశారు.

 


 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !