మణిపూర్ హింసపై విపక్షాల పట్టు: లోక్ సభలో గందరగోళం, మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

Published : Jul 25, 2023, 11:18 AM ISTUpdated : Jul 25, 2023, 11:31 AM IST
మణిపూర్ హింసపై  విపక్షాల పట్టు: లోక్ సభలో గందరగోళం, మధ్యాహ్నం  2 గంటల వరకు  వాయిదా

సారాంశం

మణిపూర్ అంశంపై  మంగళవారంనాడు విపక్షాలు లోక్ సభలో నిరసనకు దిగాయి.   

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై  మంగళవారంనాడు విపక్షాలు  లోక్ సభలో  నిరసనకు దిగారు. సభలో  గందరగోళ వాతావరణం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే  మధ్యాహ్నం రెండు గంటలకు  వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్  ఓం బిర్లా ప్రకటించారు.

ఇవాళ  ఉదయం  11 గంటలకు  పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.  లోక్ సభ ప్రారంభం కాగానే  మణిపూర్ అంశంపై  చర్చకు  విపక్షాలు పట్టుబట్టాయి.  ప్లకార్డులతో  విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు  ఆందోళనకు దిగారు.  మణిపూర్ విషయమై చర్చ చేపట్టాలని కోరుతూ  విపక్ష పార్టీల ఎంపీలు  నినాదాలు  చేశారు.అయితే  విపక్ష పార్టీలకు  చెందిన ఎంపీలు నినాదాలు  చేయవద్దని స్పీకర్ ఓం బిర్లా సూచించారు.  చర్చకు  ప్రభుత్వం కూడ సిద్దంగా ఉన్నట్టు ప్రభుత్వం  చేసిన ప్రకటనను స్పీకర్ బిర్లా  ఈ సందర్భంగా గుర్తు  చేశారు.  అయినా కూడ విపక్ష పార్టీల సభ్యులు వినిపించుకోలేదు.   దీంతో  సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దరిమిలా  లోక్ సభను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు  స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ఈ నెల  20న ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మణిపూర్ అంశంపై  విపక్షాలు  పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనకు దిగుతున్నాయి.  ఈ విషయమై చర్చకు  విపక్ష పార్టీలు  నిరసనలు చేస్తున్నాయి.  ప్రధాని మోడీ  లోక్ సభలో ప్రకటన చేయాలని  విపక్షాలు డిమాండ్  చేస్తున్నాయి. ఈ విషయమై  ఆందోళన చేస్తున్నాయి.  

ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చalso read:

మణిపూర్ అంశంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని  సోమవారంనాడు  కేంద్ర మంత్రులు  రాజ్ నాథ్ సింగ్,  అమిత్ షాలు  ప్రకటించారు. అయినా కూడ విపక్షాలు  పట్టించుకోలేదు. ప్రధాని మోడీ  లోక్ సభలో ప్రకటన చేయాలని డిమాండ్  చేస్తున్నాయి.మరో వైపు  నిన్న రాత్రి నుండి ఇవాళ  తెల్లవారుజాము వరకు  విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే  నిరసనకు దిగారు. మరో వైపు  నిన్న రాత్రి నుండి ఇవాళ  తెల్లవారుజాము వరకు  విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే  నిరసనకు దిగారు.  మరో వైపు  విపక్ష పార్టీలకు చెందిన ఇండియా కూటమి ఎంపీలు ఇవాళ  రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.  

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?