జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు విడుతలుగా సమావేశాలు..

Published : Jan 14, 2022, 01:10 PM ISTUpdated : Jan 25, 2022, 08:39 AM IST
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు విడుతలుగా సమావేశాలు..

సారాంశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session for FY22) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడుతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session for FY22) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడుతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా జనవరి 31న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల ఉభయ సభలను ప్రసంగించనున్నారు. తొలివిడుతలో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వరకు సమావేశాలు నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలను నిర్వహించనున్నారు. 

బడ్జెట్ సమావేశాల తొలి విడుతలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఇక, గతేడాది నవంబర్ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22వరకు కొనసాగాయి. తొలుతు డిసెంబర్ 23వరకు సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ.. ఒక్క రోజు ముందుగానే సమావేశాలను ముగించారు. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో సానిటేషన్‌ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పనులు సాగుతున్న తీరును లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ సమావేశాలకు పార్లమెంట్‌లో సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!